Site icon HashtagU Telugu

Vijay Devarakonda: ఆ కారణం వల్లే విజయ్ పై నెగిటివిటి పెరిగిందా.. భారీగా ట్రోల్స్!

Vijay

Vijay

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్నారు విజయ్. అయితే విజయ్ దేవరకొండ తో పాటు టాలీవుడ్ లో చాలామంది హీరోలు ఎదుగుతున్నారు. కానీ వారిపై ఎవరిపై లేనంత నెగెటివిటీ హీరో విజయ్ దేవరకొండ పై చాలా ఉంది. గత సినిమాల విషయంలో కూడా ఈ విషయాన్ని బాగా గమనించవచ్చు.

We’re now on WhatsApp. Click to Join
కాగా విజయ్ నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా ఒక రేంజ్ లో జరిగాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పాటు మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. కానీ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం పై ఉన్న నెగిటివిటి తగ్గించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఎంత వరకు ఫలిస్తుందో చెప్పలేం. గతంలో లైగర్ మూవీ సమయంలో భారీగా నెగిటివిటీ వచ్చింది. విజయ్ పై అనేక రకాల ట్రోల్స్ మీమ్స్ కూడా క్రియేట్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో నెగటివ్ గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

Also Read: Swetha Naidu: తల్లిదండ్రుల ముందు కన్నీరు పెట్టుకున్న శ్వేతా నాయుడు.. స్టేజ్ పై అలా!

అయితే నెటిజన్స్ విజయ్ దేవరకొండ సినిమాలపై ట్రోల్ చేస్తున్నారా లేదా అతడి యాటిట్యూడ్ పైనా అనేది మాత్రం అర్థం కాని విషయం. విజయ్ కెరీర్ కి లైగర్ చిత్రంతోనే డ్యామేజ్ జరిగిందనేది కొందరి అభిప్రాయం. కానీ ఒక్కటి మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ఒకే తరహా సక్సెస్ ఫార్ములాని పట్టుకుని దాని వెంటే వెళుతున్నాడు ఈ రౌడీ హీరో. అదే దెబ్బ కొడుతోంది అని అంటున్నారు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రెండు వైవిధ్యమైన చిత్రాలు. ఒక్కో హీరోకి ఒక్కో తరహా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగని సినిమా మొత్తం హీరోల బాడీ లాంగ్వేజ్ పై నడవదు. విజయ్ దేవరకొండ చిత్రాల్లో అదే జరుగుతున్నట్లు అనిపిస్తోంది. అతడి యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ని హైలైట్ చేస్తున్నారు కానీ కథని గాలికి వదిలేస్తున్నారు.

Also Read: Pushpa 2: పుష్ప2 పై అలాంటి పోస్ట్ చేసిన సురేష్ రైనా.. నెట్టింట పోస్ట్ వైరల్!

Exit mobile version