Ram Charan: రామ్ చరణ్ దైవ భక్తి.. అయ్యప్ప మాలలోనే ఆస్కార్స్ కు!

రామ్ చరణ్ (Ram Charan) అయ్యప్ప మాల విధిగా ధరించి ఆధ్యాత్మిక సేవలో తరిస్తుంటాడు.  

Published By: HashtagU Telugu Desk
Ramcharan

Ramcharan

ప్రతి ఏడాది మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) అయ్యప్ప మాల విధిగా ధరించి ఆధ్యాత్మిక సేవలో తరిస్తుంటాడు.  కేరళలోని శబరిమల ఆలయాన్ని సందర్శించే ముందు 41 రోజుల అయ్యప్ప దీక్షను పాటిస్తుంటాడు. ఈ ఏడాది కూడా 41 రోజుల పాటు నల్లని దుస్తులు ధరించి పాదరక్షలు లేకుండా సాధారణ భక్తుల్లాగే పూజలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆస్కార్‌ (Oscar) వేడుకల కోసం మంగళవారం హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లిన నటుడు రామ్‌చరణ్‌ ఎయిర్‌పోర్టులో మరో కారణంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. సాదాసీదా నల్లని రంగు దుస్తుల్లో అయ్యప్ప మాలలో పాదరక్షలు లేకుండా నడుస్తూ కనిపించాడు.

అయ్యప్ప (Ayyappa) దీక్షలో చెప్పులు లేకుండా నడవడం, నల్ల బట్టలు ధరించడం వంటివి ఉంటాయి. ఇంతకు ముందు కూడా రామ్ చరణ్ (Ram Charan)  అనేక ప్రచార కార్యక్రమాలలో చెప్పులు లేకుండా, నలుపు బట్టలు ధరించి కనిపించాడు. ఇక ఇప్పటికే RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. మగధీర తర్వాత రామ్ చరణ్ రెండవసారి SS రాజమౌళితో కలిసి నటించారు. 300 కోట్ల అంచనాతో తెరకెక్కిన RRR ఇప్పటికే రూ. ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మార్క్ కు చేరుకుంది. ప్రస్తుతం చరణ్ (Ram Charan) శంకర్ డైరెక్షన్ లో భారీ ప్రాజెక్టు మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎన్నో అంచనాలను క్రియేట్ చేస్తోంది.

Also Read: Prabhu Hospitalized: నటుడు ప్రభుకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!

  Last Updated: 22 Feb 2023, 02:57 PM IST