Site icon HashtagU Telugu

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ ఇలా చేస్తున్నాడేంటీ ? వీడియో వైరల్

Anchor Pradeep

Anchor Pradeep

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్‌కు బుల్లితెరపై తెగ ఫాలోయింగ్, క్రేజ్‌ ఉన్నాయి. వరుస షోస్‌, ఈవెంట్స్ చేసి ప్రజలకు బాగా ఆయన బాగా దగ్గరయ్యాడు.ప్రదీప్ పలు సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే మూవీలో హీరోగానూ పని చేశాడు.  అయితే ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో ప్రదీప్ మళ్లీ యాంకరింగ్ స్టార్ట్ చేసి తన పూర్తి ఫోకస్‌ను బుల్లితెరపైకి మళ్లించాడు. ఢీ షోకు యాంకర్‌గా వ్యవహరించి తిరుగులేని క్రేజ్ దక్కించుకున్న ఆయన సడెన్‌గా తప్పుకుని అందరికీ షాకిచ్చాడు.ప్రదీప్ ఎందుకు ఇలా సైలెంట్ అయిపోయాడు.. ఎందుకు ఎక్కువగా షోలు చేయడం లేదు? కారణం ఏమై ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఇటీవల బుల్లితెర షోస్‌లోనూ కనిపించడం లేదు. దీంతో ప్రదీప్‌కు ఏమైంది అంటూ ఫ్యాన్స్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో  ప్రదీప్‌కు(Anchor Pradeep) సంబంధించిన ఒక వీడియోను చూసి అందరూ అవాక్కవుతున్నారు. అందులో అతడి స్టంట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు  నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ యాంకర్ ప్రదీప్ ఇప్పుడు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడిపోతున్నాడు. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ బాడీని పెంచుతున్నాడు. కొందరు మాత్రం.. ‘‘యాంకరింగ్ మానేసి నువ్వు చేసేది ఇదా? ఏంటి మళ్లీ సినిమాలు తీస్తున్నావా? ఇందుకేనా ఇవన్నీ చేసేది ’’అని కామెంట్లు పెడుతున్నారు.  ‘‘ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అన్నా.. మనకు సినిమాలు అవసరమా?.. యాంకరింగ్ చేయ్ చాలు అన్నా.. ఈ బాడీ పెంచినంత మాత్రం ఏం ఉపయోగం అన్నా.. ఇదంతా ఎందుకు చేస్తున్నావ్.. యాంకరింగ్ చేస్తూ బాగానే ఉన్నావ్ కదా.. ఇదంతా అవసరమా? జిమ్ చేసేటప్పుడు కూడా విగ్ వదలడం లేదు’’ అంటూ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కొంత మంది మాత్రం ప్రదీప్ డెడికేషన్, హార్డ్ వర్క్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Also Read :Narendra Modi : వందే భారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

యాంకర్ రష్మీ గౌతమ్ పెద్ద జంతు ప్రేమికురాలు. మూగజీవాలకు ఎవరైనా హాని తలపెడితే వెంటనే సదరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏకిపారేస్తూ ఉంటుంది. అలాంటి రష్మీకి ఇప్పుడు తీరని దుఃఖమే మిగిలింది. తను ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్న తన పెంపుడు శునకం ‘చుట్కీ’ని రష్మీ కోల్పోయింది. తన పెట్ డాగ్ ఎలా చనిపోయిందో తెలీదు కానీ రష్మీ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘చుట్కీ గౌతమ్‌’ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందంటూ తన శునకంతో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది రష్మీ. చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు దానితో గడిపిన ఫొటోలన్నీ షేర్ చేస్తూ చివరిలో అంత్యక్రియలు నిర్వహించిన పిక్స్ కూడా పంచుకుంది. అలానే చుట్కీ చితాభస్మాన్ని కారులో తన వెంట తీసుకెళ్తున్న ఫొటోను కూడా పోస్ట్ చేసింది.