Site icon HashtagU Telugu

Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో..?

Another Record for Allu Arjun South Number 1 Pushpa Raj

Another Record for Allu Arjun South Number 1 Pushpa Raj

ఐకాన్ స్టార్ ట్యాగ్ లైన్ రావడమే కాదు నేషనల్ స్టార్ గా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు అల్లు అర్జున్(Allu Arjun) . పుష్ప 1 రిలీజ్ ముందు వరకు అల్లు అర్జున్ అంటే తెలుగు హీరో అతని సినిమాలు కేరళలో కూడా బాగా ఆడటంతో తెలుగు, మళయాళ మార్కెట్ బాగానే చేస్తున్నాడు. బోయపాటి సరైనోడు సినిమా వల్ల హిందీలో కొంతమేర క్రేజ్ తెచ్చుకున్నాడు. సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్ మరే సినిమాకు రానంత క్రేజ్ తెచ్చుకుంది. అదే పుష్ప 1 లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ని బాగా లేపేందుకు సహకరించింది.

పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అంతేకాదు తను పడిన కష్టానికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చి చేరింది. ఇక ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమా కూడా ఆడియన్స్ అంచనాలు ఎన్ని ఉన్నా దానికి ఒక మెట్టు పైనే ఉంటుందని చెబుతున్నారు. నేషనల్ అవార్డ్ పుష్ప టీం కి సరికొత్త ఉత్సాహం ఇవ్వడమే కాదు పుష్ప 2 ని నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించేలా చేస్తున్నారు.

ఇక ఇదిలాఉంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అన్నది పెద్ద టాస్క్ అయ్యింది. స్టార్ డైరెక్టర్స్ అంతా కూడా అల్లు అర్జున్ తో సినిమా కోసం రెడీ అంటున్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ తో సందీప్ వంగ ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అన్నది తెలియదు. మరో పక్క తమిళ దర్శకులు అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ లు కూడా అల్లు అర్జున్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. త్రివిక్రం కూడా అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేశాడు.

మరో ఒకరిద్దరు టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా Allu Arjun తో సినిమాకు రెడీ అంటున్నారు. ఇవన్నీ సరే అల్లు అర్జున్ ఆప్షన్ ఎవరు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తడన్నది ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 ఎలాగు పుష్ప క్రేజ్ మీద నెట్టుకొస్తుంది. ఆ తర్వాత సినిమాకే అసలు పరీక్ష ఉంటుందని చెప్పొచ్చు. బన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాడో కానీ తనకు వచ్చిన ఈ క్రేజ్ తో ఇక మీదట అన్ని సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ చేస్తేనే బెటర్ అని అల్లు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Also Read : All You Need to Know : బీ అలర్ట్ అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. మీ జేబులు ఖాళీ అవ్వకుండా చూసుకోండి..!