గాయని ప్రవస్తి (Singer Pravasthi) చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఈ విషయంపై ప్రముఖ గాయని, అనేక రియాలిటీ షోల జడ్జిగా వ్యవహరించిన సునీత (Sunitha) స్పందిస్తూ ప్రవస్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రవస్తి తన అనుభవాలను తప్పుగా చిత్రీకరిస్తూ, వాటిని పూర్తిగా వ్యక్తిగతంగా తీసుకుంటోందని సునీత అభిప్రాయపడ్డారు. “ప్రేక్షకులకు నిజమైన విషయాలు వెల్లడించాల్సిన బాధ్యత నీవు తీసుకోవాలి” అని ఆమె సూచించారు.
Raj Kasireddy : రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి.. ఏం అడిగారు ? ఏం చెప్పాడు ?
“నిన్ను చిన్నపుడు ముద్దు పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు అలా చేస్తే బాగుండదనే విషయాన్ని నువ్వే గ్రహించాలి” అని వ్యాఖ్యానించారు. పోటీల సమయంలో ఎవరు బాగా పాడినా జడ్జులు భావోద్వేగానికి లోనవుతారని, అలా స్పందించడం అనేకసార్లు జరిగేదేనని చెప్పారు. అంతేగాక ప్రవస్తి గతంలో అనేక పోటీల్లో పాల్గొన్నందున ఈ ప్రక్రియలన్నీ తనకు తెలిసి ఉండాల్సిందని సునీత పేర్కొన్నారు. ఏదైనా షోలో పాటలు పాడే విషయంలో టీవీ ఛానళ్లకు కొన్ని హక్కుల పరిమితులు ఉంటాయని, ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం ద్వారా ప్రేక్షకుల్లో అవగాహన పెరిగేదని అభిప్రాయపడ్డారు.
చివరిగా ప్రవస్తి తాము పనిచేసిన విధానం గురించి మాట్లాడే స్థాయికి వచ్చిందని, నువ్వు నిజాన్ని వివరించే ప్రయత్నం చేస్తే నేను నిజంగా ఆనందిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. సునీత చెప్పిందని ప్రకారం ప్రవస్తి చెప్పే దానిలో ఏమాత్రం నిజం లేదని చెప్పకనే చెప్పింది. మరి వ్యవహారంలో ఇంకెన్ని మలుపు తిరుగుతాయో చూడాలి.