పుష్ప 2′ ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లలోని సంధ్య థియేటర్ ( Sandhya Theatre) వద్ద ‘పుష్ప-2’ ప్రీమియర్ (‘Pushpa-2’ Premiere Show)) సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ (Woman Dies)మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హడావుడి కారణంగా తగిన భద్రతా చర్యలు చేపట్టలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌లను అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. థియేటర్ వద్ద భద్రతా చర్యల విఫలమవ్వడం , పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను నియంత్రించడంలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనలో ‘పుష్ప-2’ చిత్ర నటుడు అల్లు అర్జున్ మరియు చిత్ర బృందంపై కూడా కేసులు నమోదయ్యాయి.
కాగా ఈ కేసులపై సంధ్య థియేటర్ యజమాని హైకోర్టు ను ఆశ్రయించారు. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు. అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం. అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం’ అని పేర్కొన్నారు. మరి దీనిపై కోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Also : Mohan Babu Health Bulletin : మోహన్ బాబు హెల్త్ బులెటిన్