బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ ఖాన్ (Salman Khan) క్రేజ్ వేరే. ఎంతో మంది కొత్త కొత్త స్టార్ పుట్టుకొస్తున్న ఈ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఇక మాస్ లో సల్మాన్ ఖాన్ కింగ్. ఆయన సినిమాలు రిలీజ్ అయినా, ఆయన పుట్టిన రోజులు అయినా అభిమానుల హంగామా అంతాఇంతా ఉండదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు (Salman Khan) తన 57వ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. సల్మాన్ చూసేందుకు వేలాది మంది అభిమానులు ఆయన ఇంటి ముందు భారీగా గూమిగూడారు. సల్మాన్ తన గెలాక్సీ అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి ఫ్యాన్స్ కు అభివాదం చేశాడు. అయితే సల్మాన్ చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అభిమానులను (Fans) అదుపు చేయలేక పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముంబై (Mumbai) లోని సల్మాన్ ఇంటి ముందు మార్నింగ్ నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. తమ అభిమాన హీరోను చూసేందుకు గంటల తరబడి ఎదురుచూశారు. అభిమానులను విష్ చేయడానికి సల్మాన్ తన తండ్రి సలీం ఖాన్‌తో కలిసి కనిపించాడు. దీంతో ఎమోషన్ అభిమానులు (Fans) ‘‘సల్లూభాయ్’’ అని కేకలు వేస్తూ గోల గోల చేశారు. అభిమానుల రాకతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చూసి పరిస్థితిని అదుపు చేయాల్సివచ్చింది. పోలీసుల లాఠీచార్జితో అభిమానులు తమ చెప్పులు, బూట్లు వదిలివేసిన ఘటన కూడా వీడియోలో చూడొచ్చు.
Also Read : Megastar: ‘వాల్తేరు వీరయ్య’ అంచనాలకు మించి ఉంటుంది – మెగాస్టార్ చిరంజీవి