KTR : హైదరాబాద్‌కి వార్నర్ బ్రో సంస్థ.. KTR అమెరికా టూర్ లో పెద్ద సంస్థనే తెస్తున్నారుగా..

ప్రపంచ మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ ప్రతినిధులతో KTR సమావేశమయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Warner Bros. Discovery into the entertainment Industry in Telangana KTR Invites

Warner Bros. Discovery into the entertainment Industry in Telangana KTR Invites

తెలంగాణ(Telangana) మంత్రి KTR ప్రస్తుతం అమెరికా(America) పర్యటనలో ఉన్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనటానికి KTR అమెరికా వెళ్లారు. అలాగే ఈ అమెరికా పర్యటనలోనే తెలంగాణాలో పెట్టుబడుల కోసం పలు దిగ్గజ కంపెనీలతో కూడా సమావేశం అవుతున్నారు KTR. తాజాగా KTR చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ప్రపంచ మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ ప్రతినిధులతో KTR సమావేశమయ్యారు. వార్నర్ బ్రదర్స్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా కార్డర్ తో సమావేశమయి హైదరాబాద్ లో తమ సంస్థ కార్యకలాపాలు చేయాలని, ఇండియాలో మీడియా, సినిమా రంగం అభివృద్ధి గురించి చెప్పి, ఇటీవల టాలీవుడ్ సాధిస్తున్న విజయాలను గుర్తు చేసి వార్నర్ బ్రదర్స్ సంస్థను హైదరాబాద్ కు ఆహ్వానించారు.

వార్నర్ బ్రదర్స్ సంస్థ KTR ప్రతిపాదనకు ఒప్పుకుంది. దీంతో వార్నర్ బ్రదర్స్ సంస్థ హైదరాబాద్ లో తమ ఆఫీస్ ని ఓపెన్ చేయనుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్, మీడియా రంగంలో పలువురికి ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి, ఇక్కడ షూటింగ్స్ చేయడానికి వార్నర్ బ్రదర్స్ ఒప్పుకోవడంతో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు KTR. ఆ సంస్థతో మీటింగ్ జరిగిన ఫొటోలు KTR తన ట్విట్టర్ లో షేర్ చేసి.. వార్నర్ బ్రదర్స్ హైదరాబాద్ కి వస్తుందని, మన మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగం మరింత అభివృద్ధిచెందుతుందని, ఇండస్ట్రీ ప్రముఖులతో కూడా దీని గురించి మాట్లాడానని, మొదటి దశలోనే దాదాపు 1200 మందికి ఉపాధి కలగనుంది తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక వార్నర్ బ్రదర్స్ లాంటి పెద్ద సంస్థ హైదరాబాద్ కు వస్తుండటంతో పలువురు సినీ, మీడియా ప్రతినిధులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  Pawan Kalyan- Sai Dharam Tej: సరికొత్త లుక్ లో పవర్ స్టార్.. బ్రో మోషన్ పోస్టర్ అదుర్స్!

  Last Updated: 18 May 2023, 07:22 PM IST