Site icon HashtagU Telugu

Viswak Sen : ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా.. ఆడియన్స్ కు షాక్ ఇస్తున్న విశ్వక్ ఛాయిస్..!

Viswak Sen Comments on Vijay Setupathi Maharaja Movie

Viswak Sen Comments on Vijay Setupathi Maharaja Movie

Viswak Sen మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అని తెలిసిందే. తను పాల్గొనే ప్రతి ఈవెంట్ లో ఈ విషయాన్ని స్పెషల్ గా చెబుతాడు విశ్వక్ సేన్. ఈ క్రమంలో ఒకవేళ ఎన్టీఆర్ సినిమా తను చేయాల్సి వస్తే ఎలాంటి సినిమా చేస్తారని విశ్వక్ ని అడిగితే ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలను వదిలి ఫ్లాప్ సినిమాను ఎంచుకున్నాడు. ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు సినిమాను మళ్లీ చేయాలని ఉందని అన్నాడు విశ్వక్ సేన్.

విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన నా అల్లుడు సినిమాను వర ముల్లపుడి డైరెక్ట్ చేశారు. శ్రీయ శరణ్, జెనిలియా హీరోయిన్స్ గా నటించారు. రమ్యకృష్ణ కూడా ఈ సినిమాలో నటించారు. ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు. అయితే ఛాన్స్ వస్తే నా అల్లుడు చేస్తా అంటున్నాడు విశ్వక్ సేన్.

ఆ సినిమా కథను కాస్త మార్చి తను డైరెక్ట్ చేస్తానని అంటున్నాడు విశ్వక్ సేన్. ఎన్టీఆర్ నటించిన నా అల్లుడు సినిమాను విశ్వక్ మళ్లీ తన డైరెక్షన్ లో చేస్తానని చెప్పడం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో.. మాస్ కా దాస్ ఫ్యాన్స్ లో సంతోషాన్ని ఇస్తుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను చైతన్య కృష్ణ డైరెక్ట్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి నటించారు.

Also Read : Malavika Mohanan : రాజా సాబ్ బ్యూటీ అందాలతో రఫ్ఫాడించేస్తుంది..!