Site icon HashtagU Telugu

Viswak Sen : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కోసం ఆ పని పూర్తి చేసిన విశ్వక్..!

Is Hero Changed for Krishna Chaitanya Gangs Of Godhavari

Is Hero Changed for Krishna Chaitanya Gangs Of Godhavari

Viswak Sen మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో సూపర్ ఫాం లో ఉన్నాడు. రీసెంట్ గా గామి సినిమాతో సర్ ప్రైజ్ చేసిన విశ్వక్ ఆ సినిమా తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో రాబోతున్నాడు. చైతన్య కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. అసలైతే సినిమా ముందే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కొన్ని అడ్జెస్ట్ మెంట్స్ వల్ల వాయిదా వేస్తూ వచ్చారు.

సమ్మర్ లో మాస్ కా దాస్ మాస్ మేనియా చూపించాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా నుంచి శనివారం సాయంత్రం 4:01 గంటలకు టీజర్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ టీజర్ కు సంబందించిన డబ్బింగ్ పనులను విశ్వక్ నిన్న రాత్రి పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పీరియాడికల్ సినిమాగా వస్తుంది. సినిమాలో విశ్వక్ సేన్ ఎనర్జీ అదిరిపోతుందని అంటున్నారు. సినిమా పై అంచనాలను టీజర్ తోనే పెంచాలని చూస్తున్నారు. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

వరుస హిట్లతో దూసుకెళ్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాతో సితార బ్యానర్ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు.

Also Read : Suhas Prasanna Vadanam : సుహాస్ సినిమాకు బడా బ్యానర్స్ సపోర్ట్..!