ఎన్టీఆర్ కొరటాల శివ (Koratala Siva) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర 1 సెప్టెంబ 27న రిలీజ్ కాగా సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అదరగొట్టింది. ఫైనల్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఈమధ్యనే ఓటీటీలో కూడా రిలీజైంది. ఐతే డిజిటల్ రిలీజ్ అయినా కూడా సినిమా ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుంది. సుదర్శన్ థియేటర్ లో దేవర 50 రోజుల సెలబ్రేషన్స్ జరిగాయి.
తారక్ మీద అభిమానాన్ని..
ఈ వేడుకలకు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Viswak Sen) అటెండ్ అయ్యాడు. ఎన్టీఆర్ (NTR) కు వీరాభిమాని అయిన విశ్వక్ సేన్ తారక్ మీద అభిమానాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా దేవర 50 రోజుల సెలబ్రేషన్స్ తో మిగతా ఫ్యాన్స్ తో పాటు విశ్వక్ సేన్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. దేవర (Devara) సినిమా 56 కేంద్రాల్లో 50 రోజుల వేడుక జరుపుకుంటుంది.
దేవర 1 సినిమాను ఒక ట్విస్ట్ తో ముగించాడు కొరటాల శివ. దేవర 2 కి మంచి లీడ్ అయితే దొరికింది. ఐతే దేవర 2 ఎప్పుడు ఉంటుంది. దానికి తారక్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడన్నది చూడాలి. ఈమధ్య కాలంలో ఒక సినిమా 50 రోజుల దాకా ఆడటం అనేది చాలా గొప్ప విషయమని చెప్పొచ్చు. దేవర 1 రిలీజైన నాటి టాక్ కి సినిమా లాంగ్ రన్ కి.. వచ్చిన వసూళ్లకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది.
Also Read : Dhanush kubera First Glmpse : కుబేర గ్లింప్స్.. ధనుష్ లుక్స్ అదుర్స్..!