Site icon HashtagU Telugu

VishwakSen : మరోసారి దర్శకుడిగా మారిన విశ్వక్ సేన్.. నిర్మాతగా కూడా.. కొత్త సినిమా అనౌన్స్..

Vishwaksen New Movie Announced in his Direction Titled as #Cult

Vishwaksen New Movie Announced in his Direction Titled as #Cult

VishwakSen : వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ కు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు నిరాశపరిచాయి. విశ్వక్ గత రెండు సినిమాల్లో మెకానిక్ రాకీ యావరేజ్ గా నిలవగా లైలా డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ అనే కామెడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపైనే విశ్వక్ అంచనాలు పెట్టుకున్నాడు.

తాజాగా నేడు విశ్వక్ కొత్త సినిమా ప్రకటించాడు. #కల్ట్ అనే టైటిల్ తో విశ్వక్ తన కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ సినిమాని విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని తన వన్మయి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతగా కూడా మరొకరితో కలిసి నిర్మిస్తున్నాడు. నేడు ఈ సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబుతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో యజ్ఞ తుర్లపాటి, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

గతంలో విశ్వక్ డైరెక్టర్ గా చేసిన ఫలక్ నామా దాస్, దాస్ కా ధమ్కీ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో మరోసారి విశ్వక్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ కల్ట్ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. నేటి నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.

 

Also Read : Mothers Day 2025 : ‘మదర్స్ డే’.. రామ్‌చరణ్‌, చిరు, నాని, సాయి పల్లవి ఎమోషనల్