Vishwak Sen : నేడు వినాయకచవితి సందర్భంగా సెలబ్రిటీలు కూడా తమ ఇళ్లల్లో పూజలు చేసి ఆ ఫొటోలు, వీడియోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలే వాడండి అని ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో హీరో విశ్వక్ సేన్ సొంతంగా మట్టితో వినాయకుడిని తయారుచేసి పూజించాడు.
చిన్నప్పుడు మనమంతా మట్టితో సొంతంగా వినాయకుడిని తయారుచేసే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరూ అంత సమయం కేటాయించి మట్టితో వినాయకుడిని చెయ్యట్లేదు. మార్కెట్లో దొరికే విగ్రహాలే తెచ్చి పూజలు చేస్తున్నారు. అయితే హీరో విశ్వక్సేన్ మట్టి తీసుకొచ్చి సొంతంగా వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడినే ఇంట్లో పెట్టి వినాయకచవితి పూజలు చేశారు. విశ్వక్ మట్టితో వినాయకుడిని తయారుచేసే వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
దీంతో విశ్వక్ వీడియో వైరల్ గా మారగా అభిమానులు, నెటిజన్లు విశ్వక్ ని అభినందిస్తున్నారు. మీరు కూడా విశ్వక్ మట్టితో వినాయకుడిని తయారుచేసే వీడియో చూసేయండి..
Also Read : Niharika : బాబాయ్ బాటలో కూతురు.. బుడమేరు ముంపు గ్రామాలకు నిహారిక సాయం..