Site icon HashtagU Telugu

Gangs of Godavari Teaser : విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్ చూశారా..?

Vishwak Sen Neha Shetty Gangs Of Godavari Movie Teaser Released

Vishwak Sen Neha Shetty Gangs Of Godavari Movie Teaser Released

Gangs of Godavari Teaser : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న పీరియాడిక్ రూరల్ యాక్షన్ డ్రామా మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లింప్స్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

ఈ టీజర్ పూర్తి యాక్షన్ కట్ తో రిలీజ్ చేసారు. తన కింద పని చేసే వారంతా కలిసి హీరోని (విశ్వక్ సేన్) చంపడం కోసం ప్రయత్నిస్తున్న సన్నివేశాలను టీజర్ లో చూపించారు. టీజర్ చూస్తుంటే.. విశ్వక్ సేన్ పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఊర మాస్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇసుక మాఫియా, రాజకీయ దందాతో సినిమా కథాంశం ఉండబోతుందని తెలుస్తుంది. టీజర్ అయితే సింపుల్ గా సూపర్ అనిపించింది.

కాగా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు కృష్ణ చైతన్య.. గతంలో రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగ చిత్రాలను తెరకెక్కించారు. ఆ రెండు సినిమాలు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి, కానీ కమర్షియల్ గా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు టీజర్ చూస్తుంటే.. ఈసారి ఈ దర్శకుడు కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నారు. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 17న రిలీజ్ చేయబోతున్నారు.

Also read : Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. సలార్ 2 షూటింగ్ అప్డేట్..