Site icon HashtagU Telugu

Vishwak Sen : మీరు అనుకున్న స్థాయిలో నా సినిమాలు లేవు.. లైలా ఫ్లాప్ తర్వాత విశ్వక్ ఎమోషనల్ లెటర్..

Vishwak Sen Emotional Letter to Fans and Audience after Laila Flop

Vishwak Sen

Vishwak Sen : యువ హీరోల్లో వరుసగా సినిమాలు చేసే వాళ్ళల్లో విశ్వక్ సేన్ ఒకరు. గతంలో వరుస హిట్స్ కొట్టినా గత రెండు సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. మెకానిక్ రాకీ యావరేజ్ గా నిలిచినా లైలా సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. లైలాలో విశ్వక్ లేడీ గెటప్ అని ఓ రేంజ్ లో ప్రమోట్ చేసినా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండి, బాగా సాగదీయడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది.

లైలా ఫ్లాప్ తర్వాత విశ్వక్ సేన్ మొదటిసారి తన ఫ్యాన్స్, ప్రేక్షకులను ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియాలో ఓ లెటర్ రాసాడు.

విశ్వక్ సేన్ తన లెటర్ లో.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇక పై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇక పై కేవలం సినిమా మాత్రమే కాదు. నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే, నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం అంటూ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం విశ్వక్ సేన్ అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉండనుంది. మరి ఈ సినిమాతో విశ్వక్ గ్రాండ్ కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.

 

Also Read : NTR – Neel : ఎన్టీఆర్ – నీల్ సినిమా షూట్ మొదలయింది.. షూటింగ్ ఫోటో షేర్ చేసి..