తెలుగు సినిమా ప్రేక్షకులకు తన ప్రత్యేకమైన యాస, హాస్యంతో ఎంతో చేరువైన నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) ప్రస్తుతం తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడంతో గత కొన్నేళ్లుగా డయాలసిస్‌పై జీవనం సాగిస్తున్న ఆయన, ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి అవసరం ఏర్పడగా, వెంకట్ కుటుంబం ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. డోనర్ కోసం అనేక ప్రయత్నాలు సాగుతున్నాయని, వారి ఇల్లు అమ్మినా ఖర్చులకు సరిపోవడం లేదని ఆయన కుమార్తె స్రవంతి తెలిపింది.
Rajasthan : సోషల్ మీడియా మోజు..ఆరేళ్ల కుమార్తెతో డేంజర్ స్టంట్
ఈ క్రమంలో ఫిష్ వెంకట్ పరిస్థితిపై స్పందించిన యువ నటుడు విశ్వక్ సేన్ తన మానవతా ధర్మాన్ని చాటుకున్నారు. వెంకట్ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేసిన విశ్వక్ సేన్(Vishwak Sen donates Rs. 2 lakh )కు అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ సాయం చేస్తున్నాడన్న వార్తలపై వెంకట్ భార్య, కుమార్తె స్పందిస్తూ .. అవి నకిలీ వార్తలని, ఎవరో “ప్రభాస్ మేనేజర్” పేరుతో కాల్ చేసి మోసపుచ్చారని తెలిపారు. అయితే ప్రభాస్‌కు ఈ విషయం తెలిస్తే తప్పకుండా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Bomb Threats : హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు
ఫిష్ వెంకట్ కుటుంబం సినిమా రంగానికి, ప్రభుత్వాన్ని తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మంచి నటుడిగా పేరొందిన ఆయన అనేక హిట్ సినిమాల్లో కామెడీ, విలన్ పాత్రల్లో మెప్పించారు. ‘గబ్బర్ సింగ్’, ‘బన్నీ’, ‘ఖైదీ నెం.150’ వంటి చిత్రాల్లో ఆయన హాస్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల ‘కాఫీ విత్ ఏ కిల్లర్’, ‘మా వింత గాధ వినుమా’ వంటి వెబ్ సిరీస్‌లలో కనిపించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సినీ పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చి సహాయహస్తం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. సోమవారం ఆసుపత్రికి వెళ్లి వెంకట్‌ను పరామర్శించిన ఆయన, వైద్యులతో మాట్లాడి పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఫిష్ వెంకట్ తెలంగాణ యాసను వెండితెరకు చక్కగా పరిచయం చేసిన గొప్ప నటుడిగా ప్రశంసిస్తూ, ఆయన చికిత్సకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకొని మళ్లీ సినిమాల్లో కనిపించాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రజలంతా ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతున్నారు.