Vishnu vs Manoj : కుక్క..నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్ – మంచు మనోజ్ ట్వీట్

Vishnu vs Manoj : సోషల్ మీడియాలో మంచు విష్ణు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తాను నటించిన 'రౌడీ' సినిమాలోని ఓ డైలాగ్ ఆడియోను ఆయన పోస్ట్ చేశారు

Published By: HashtagU Telugu Desk
Manoj Vishnu

Manoj Vishnu

మంచు ఫ్యామిలీ (Manchu Family) లో మరోసారి రగడ తారాస్థాయికి చేరింది. మనోజ్ vs విష్ణు (Vishnu vs Manoj) ల మధ్య ట్విట్టర్ వార్ ముదిరింది. కొద్దీ రోజుల క్రితం మోహన్ బాబు (Mohan Babu) ఇంట ఎంత గొడవ జరిగిందో తెలియంది కాదు..ఈ మధ్యనే జనాలు ఈ గొడవ గురించి మరచిపోతున్న తరుణంలో సంక్రాంతి రోజున తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ వెళ్లడంతో మరోసారి వివాదం పుంజుకుంది. మోహన్ బాబు ఇటు మనోజ్ ఇద్దరు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేసుకున్నారు.

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజ్..చంద్రబాబు ఎమోషనల్

ఈ క్రమంలో సోషల్ మీడియాలో మంచు విష్ణు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తాను నటించిన ‘రౌడీ’ సినిమాలోని ఓ డైలాగ్ ఆడియోను ఆయన పోస్ట్ చేశారు. తన ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారని… తన ఫేవరెట్ డైలాగ్స్ లో ఇది ఒకటి అని చెప్పుకొచ్చారు. ‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి… అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ’ అనే డైలాగ్ ను షేర్ చేశాడు. మంచు మనోజ్ తో వివాదం కొనసాగుతున్న వేళ… విష్ణు ఈ డైలాగ్ షేర్ చేయడం తో ఇది ఖచ్చితంగా మనోజ్ పైనే అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విష్ణు చేసిన ఈ ట్వీట్ తర్వాత మనోజ్ కూడా కౌంటర్ ట్వీట్ చేసాడు. “కన్నప్పలో రెబెల్ స్టార్ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకు ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు కృష్ణంరాజుకు సంబంధించిన సర్దార్ పాపారాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మనాయుడు సినిమా పోస్టర్లను జత చేసాడు. అంతకుముందు విష్ణు ట్వీట్ నేపథ్యంలో ఆ తర్వాత మనోజ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వార్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

  Last Updated: 17 Jan 2025, 08:04 PM IST