Madha Gaja Raja : 12 ఏళ్ళ తర్వాత రిలీజయి హిట్ కొట్టిన విశాల్ సినిమా.. ఇప్పుడు తెలుగులో.. ట్రైలర్ చూసారా?

మీరు కూడా విశాల్ మదగజరాజ తెలుగు ట్రైలర్ చూసేయండి..

Published By: HashtagU Telugu Desk
Vishal Madha Gaja Raja Movie Telugu Trailer Released

Madha Gaja Raja

Madha Gaja Raja : సాధారణంగా సినిమాలు అప్పుడప్పుడు పలు కారణాలతో ఆలస్యం అవుతాయని తెలిసిందే. అలా హీరో విశాల్ మదగజరాజ సినిమా ఏకంగా 12 ఏళ్ళు ఆలస్యంగా రిలీజయింది. విశాల్, సంతానం, వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి, సోనూసూద్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ్ సినిమా మదగజరాజ. జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సుందర్ C దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 2013 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ఇటీవల 2025 సంక్రాంతికి జనవరి 12న తమిళ్ లో రిలీజయింది.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మదగజరాజ సినిమా తమిళ్ ప్రేక్షకులను మెప్పించి 12 ఏళ్ళ తర్వాత వచ్చినా హిట్ కొట్టింది. తమిళ్ లో పెద్ద సినిమాలు ఏవి సంక్రాంతికి లేకపోవడంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయని సమాచారం. దీంతో ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కూడా మదగజరాజ అనే టైటిల్ తోనే జనవరి 31న రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని వెంకటేష్ రిలీజ్ చేసారు. మీరు కూడా విశాల్ మదగజరాజ తెలుగు ట్రైలర్ చూసేయండి..

 

Also Read : Mamta Kulkarni : సన్యాసం తీసుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. కుంభమేళాలో సాధ్విగా మారిపోయి..

  Last Updated: 25 Jan 2025, 11:11 AM IST