Prabhas: ప్రభాస్-హను రాఘవపూడి సినిమాకి క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్

ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Prabhas: ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా పోస్ట్ పోన్ అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సివుంది.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు కానీ.. ఇది మాత్రం కన్ ఫర్మ్ అంటూ ప్రచారం జరిగింది. దీంతో నిజంగా ప్రభాస్, హను రాఘవపూడి కాంబో మూవీ ఉందా..? లేక గ్యాసిప్పా..? అనే డౌట్ కూడా వచ్చింది. అయితే.. ఇది కన్ ఫర్మ్ న్యూస్ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారట. ఆయన సీతారామమ్ సినిమాకి మ్యూజిక్ అందించారు.

ఆ సినిమాలో మ్యూజిక్ ఎంత బాగుందో అందరికీ తెలిసిందే. అందుకనే ఈ సినిమాకి కూడా సంగీతం అందించే బాధ్యతను హను రాఘవపూడి ఇచ్చారట. ఈ విషయాన్ని విశాల్ చంద్రశేఖర్ ఓ ఇంటర్ వ్యూలో తెలియచేశారు. ప్రభాస్, హను మూవీకి సంగీతం అందిస్తున్నానని.. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుదని చెప్పారు. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది. హను తెరకెక్కించిన కృష్ణ గాడి వీరప్రేమ గాథ, పడి పడి లేచే మనసు సినిమాలకు కూడా విశాల్ చంద్రశేఖరే సంగీతం అందించారు. ఇది విశాల్ కి బంపర్ ఆఫరే. త్వరలోనే ఈ సినిమాను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హను ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో..? ప్రేమకథతో ఎలా మెప్పిస్తాడో.

Also Read: Bigg Boss Shivaji : బిగ్ బాస్ చాణక్య విలన్ గా రెడీనా.. ఆ డైరెక్టర్ హామీ ఇచ్చాడట..!