Vijayakanth Dies : విజయకాంత్ మరణ వార్త విని..తట్టుకోలేకపోయిన విశాల్

తమిళ్ చిత్రసీమలో విషాద ఛాయలు నెలకొన్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ మరణ వార్త..తమిళ్ చిత్రసీమలోనే కాదు అన్ని ఇండస్ట్రీ లలో విషాదం నింపింది. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసినప్పటికీ..విజయకాంత్ మాత్రం తన మార్కెట్ పెంచుకోవడం కోసం ఏ రోజు ఇతర […]

Published By: HashtagU Telugu Desk
Vishal Breaks Down In Tears

Vishal Breaks Down In Tears

తమిళ్ చిత్రసీమలో విషాద ఛాయలు నెలకొన్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ మరణ వార్త..తమిళ్ చిత్రసీమలోనే కాదు అన్ని ఇండస్ట్రీ లలో విషాదం నింపింది.

రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేసినప్పటికీ..విజయకాంత్ మాత్రం తన మార్కెట్ పెంచుకోవడం కోసం ఏ రోజు ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. తనకంటూ కోలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ వచ్చిన సమయంలో కూడా విజయకాంత్ తమిళ సినిమాని వదిలి ఇతర ఇండస్ట్రీల్లో వర్క్ చేయలేదు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాలు హిందీ, తెలుగులో రీమేక్ అయ్యాయి, డబ్ అయ్యాయి కానీ స్ట్రెయిట్ సినిమాలు మాత్రం చెయ్యలేదు. అలాంటి విజయకాంత్ మరణ వార్త విని అందరు కన్నీరు పెట్టుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న ఈ మధ్యనే ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, కొద్దికొద్దిగా కోలుకుంటున్నారని విజయకాంత్ భార్య తెలుపడంతో అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, అంతలోనే కరోనా ఎటాక్ అవ్వడంతో విజయకాంత్ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా హీరో విశాల్.. కెప్టెన్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ.. ఒక వీడియోను రిలీజ్ చేశాడు.

‘నా జీవితంలో నేను కలిసిన అత్యంత ఉన్నతమైన వ్యక్తుల్లో ఒకరైన #CaptainVijaykanth అన్న మరణవార్త విన్న తర్వాత నాకు కాళ్లుచేతులు ఆడలేదు. కెప్టెన్ లేదు అన్న మాట నేను ఉహించుకోలేకపోతున్నాను. ఆయన నుంచి నేను సామజిక సేవ నేర్చుకున్నాను. కెప్టెన్ అన్నా.. ఈ రోజు వరకు మిమ్మల్ని అనుసరిస్తున్నాను మరియు మీ పేరు మీద అలానే ఉంటాను. మన సమాజానికి అవసరమయ్యే అలాంటి వారిని దేవుడు ఎందుకు అంత త్వరగా దూరం చేస్తాడు. మిమ్మల్ని చివరిసారి చూడడానికి అక్కడ లేనందుకు చింతిస్తున్నాను. నాకు స్ఫూర్తి ఇచ్చిన యోధుడు మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మీరు చాలా కాలం గుర్తుండిపోతారు. ఎందుకంటే ప్రజలకు మరియు నడిగర్ సంఘం కోసం మీరు చేసిన సేవ ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక విజయకాంత్ అంత్యక్రియలు రేపు సాయంత్రం 4.30గంటలకు కోయంబేడులోని డిఎండికే కేంద్ర కార్యాలయంలో జరగనున్నాయి.

Read Also : Chandrababu: కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ

  Last Updated: 28 Dec 2023, 04:23 PM IST