అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండకు అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. విజయ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో డేటింగ్ చేస్తున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే వీరిద్దరూ తమ డేటింగ్ పుకార్లను చాలాసార్లు కొట్టిపారేశారు. ‘కేవలం స్నేహితులు’ అని బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కాఫీ విత్ కరణ్ 7లో కనిపించిన సారా విజయ్‌తో డేటింగ్ చేయాలనే కోరికను వ్యక్తం చేసిన తర్వాత ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.
తనతో డేటింగ్ గురించి సారా ఓపెన్ కామెంట్స్ చేయడంతో క్యూట్ అంటూ విజయ్ కూడా రియాక్ట్ అయ్యాడు. “మీరు ‘దేవరకొండ’ అని చెప్పే విధానం చాలా ఇష్టం. మీకు నా హగ్ అంటూ లవ్ సింబల్ తో ట్వీట్ చేశాడు. సారా గత సంవత్సరం కార్తీక్ ఆర్యన్‌ను తన క్రష్‌గా పిలిచిందని, ఆ తర్వాత ఇద్దరూ ఒకరితో ఒకరు కొంతకాలం డేటింగ్ చేశారని కూడా వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందా.. లేదా అనేది ఆసక్తి రేపుతోంది. నిజానికి సారా, విజయ్ హాట్ కపుల్‌గా కనిపిస్తారు.