Jwala Gutta : ‘గుండెజారి గల్లంతయ్యిందే’ మూవీలోని ‘డింగ్ డింగ్ డింగ్ డింగ్’ ఐటమ్ సాంగ్ గుర్తుందా. అందులో డ్యాన్స్ చేసి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అలవాటు లేకపోయినా ఆమె చక్కగా డ్యాన్స్ చేశారు. హావభావాలతో అలరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఐటమ్ సాంగ్, నితిన్‌తో తన స్నేహం గురించి పలు వివరాలను గుత్తా జ్వాల వెల్లడించారు.
Also Read :Cash For Bed Rest: బెడ్ రెస్ట్ ఆఫర్.. 10 రోజులకు రూ.4.70 లక్షలు
ఆ డ్రెస్ రోజురోజుకు చిన్నదైంది
‘గుండెజారి గల్లంతయ్యిందే’ మూవీ 2013 ఏప్రిల్ 19న విడుదలైంది. ఆ మూవీలో తాను చేసిన ఐటమ్ సాంగును తలుచుకుంటేనే ఇబ్బందిగా అనిపిస్తుందని గుత్తా జ్వాల తెలిపారు. నితిన్ తన స్నేహితుడని, అతడి రిక్వెస్టు వల్లే ఆ మూవీలో ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించినట్లు వెల్లడించారు. తాను ఓకే చెప్పిన మూడు నెలల తర్వాత పాట షూటింగ్ జరిగిందన్నారు. ‘‘తొలి రోజు నా మోకాలివరకు ఉన్న డ్రెస్ ఇచ్చారు. రోజురోజుకీ ఆ డ్రెస్ చిన్నదైపోతూ వచ్చింది. ఇదంతా ఏమిటి అనుకున్నాను. నాలుగురోజుల్లో పాట షూటింగ్ కంప్లీట్ అయింది’’ అని జ్వాల చెప్పారు. ‘‘ఆ సమయానికి నితిన్ మూవీలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే గుండెజారి గల్లంతయ్యిందే మూవీలో నాతో ఐటమ్ సాంగ్‌ను నితిన్ చేయించాడు. దీనివల్ల సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ వచ్చింది. నా ఐటమ్ సాంగ్ దెబ్బకు ఆ సినిమా హిట్టయింది’’ అని గుత్తా జ్వాల చెప్పుకొచ్చారు.
Also Read :214 Hostages Killed: 214 మంది బందీలను చంపాం.. ‘రైలు హైజాక్’పై బీఎల్ఏ ప్రకటన
తెల్లగా ఉంటే చాలు
‘‘టాలీవుడ్‌లో పని చేయాలంటే తెల్లగా ఉంటే చాలు. బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదగడంతో నాకు సినిమాల్లో అవకాశాలు చాలానే వచ్చాయి. కానీ అన్నింటికీ నో చెప్పాను. కేవలం నితిన్ రిక్వెస్టు వల్లే ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఐటమ్ సాంగ్ చేశాను’’ అని గుత్తా జ్వాల(Jwala Gutta) తెలిపారు. ‘‘నా లాంటి క్రీడాకారులు 10 గంటలు గేమ్ ఆడాక రెస్ట్ తీసుకుంటారు. కానీ సినీ ఇండస్ట్రీలో ఆ ఛాన్స్ ఉండదు. వాళ్లు నిత్యం టెన్షన్‌తో గడుపుతారు. నా భర్త విష్ణు విశాల్ కూడా మూవీ ఇండస్ట్రీలోనే ఉన్నారుగా.. నాకు తెలుసు’’ అని ఆమె పేర్కొన్నారు.