ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, విలన్ పక్కన మనుషుల్లో చేసుకుంటూ వచ్చి విజయశాంతి(Vijayashanthi) ప్రతిఘటన, కర్తవ్యం.. లాంటి సినిమాలతో స్టార్ విలన్ అయ్యారు చరణ్ రాజ్(Charan Raj). ఒకప్పుడు విలన్ పాత్రలకు(Villain Roles), నెగిటివ్ పోలీసాఫీసర్ పాత్రలకు పెట్టింది పేరుగా చరణ్ రాజ్ కొన్నాళ్ళు పరిశ్రమని ఏలారు. స్వతహాగా కర్ణాటకకు చెందిన ఆయన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ.. భాషల్లో దాదాపు 500 లకు పైగా సినిమాల్లో నటించారు. అయితే తెలుగులో 2013లో పైసా సినిమా తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ కనపడలేదు. కానీ ఇన్నాళ్లకు పదేళ్ల తర్వాత నరకాసుర సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు చరణ్ రాజ్.
“పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా “నరకాసుర”(Narakasura). అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో చరణ్ రాజ్ నటించగా తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్నాళ్లు తెలుగు సినిమాలు ఎందుకు చేయలేదో తెలిపారు.
చరణ్ రాజ్ మాట్లాడుతూ.. ప్రతిఘటన, జెంటిల్ మేన్ సినిమాలు నన్ను నటుడిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. వివిధ భాషల్లో దాదాపు 500 చిత్రాల్లో నటించాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాల్లో నటించాలనే ప్యాషన్ ఉండేది. 8 ఏళ్లు అర్థాకలితో కష్టపడ్డాను. ఆ కష్టానికి ఫలితంగా 40 ఏళ్ల కెరీర్ దక్కింది. ఈ సుదీర్ఘమైన కెరీర్ లో అనేక రకాల క్యారెక్టర్స్ చేశాను. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ తో విలన్ గా నటించాను. ఇప్పుడు మళ్లీ అలాంటివే నా దగ్గరకు తీసుకొస్తే వద్దని చెబుతున్నాను. 40 ఏళ్లలో అన్ని రకాల నెగిటివ్ పాత్రలు చేసేశాను. మళ్ళీ అవే అంటే బోర్ కొట్టి వద్దంటున్నాను. నటుడిగా డబ్బు కంటే నాకు సంతృప్తినే కోరుకుంటున్నాను. మంచి క్యారెక్టర్ ఉంటే డబ్బు ఇవ్వకున్నా నటిస్తా. అందుకే ఆ మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చినా మళ్లీ గతంలో జెంటిల్ మేన్ తరహా పోలీస్ క్యారెక్టర్స్ ఇస్తామంటే వద్దని చెప్పాను. అందుకే నాకు తెలుగులో ఈ గ్యాప్ వచ్చింది. తెలుగుకు కొంత గ్యాప్ వచ్చినా కన్నడ, మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. నరకాసుర సినిమాలో పాత్ర నాకు డిఫరెంట్ గా అనిపించి, నచ్చి చేస్తున్నాను. ఇది రీ ఎంట్రీ లాంటిదే. త్వరలో మరిన్ని తెలుగు సినిమాల్లో నటించబోతున్నాను అని తెలిపారు.
Also Read : Pawan Kalyan : సొంత సినిమా పేరే మర్చిపోయిన పవన్ కళ్యాణ్.. ఆ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్..