Vikram Thangalan : చియాన్ ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశే.. తంగలాన్ రిలీజ్ పై డైరెక్టర్ ఏమన్నాడు అంటే..!

Vikram Thangalan కోలీవుడ్ లో ఏమాత్రం ఫాం లో లేని హీరో ఉన్నాడు అంటే అది ఒక్క చియాన్ విక్రం మాత్రమే అని చెప్పొచ్చు. అక్కడ ప్రతి హీరో తమ సినిమాలతో అదరగొట్టేస్తుండగా విక్రం మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో

Published By: HashtagU Telugu Desk
Vikram Thangalan Director Pa Ranjith Cleared Release Doubts

Vikram Thangalan Director Pa Ranjith Cleared Release Doubts

Vikram Thangalan కోలీవుడ్ లో ఏమాత్రం ఫాం లో లేని హీరో ఉన్నాడు అంటే అది ఒక్క చియాన్ విక్రం మాత్రమే అని చెప్పొచ్చు. అక్కడ ప్రతి హీరో తమ సినిమాలతో అదరగొట్టేస్తుండగా విక్రం మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవుతున్నాడు. అంతేకాదు విక్రం సినిమాలు ఈమధ్య రిలీజ్ వాయిదాలు పడటంతో ఫ్యాన్స్ కి కూడా ఆయన సినిమా మీద ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది.

విక్రం ప్రసుతం తంగలాన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను పా రంజిత్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అసలైతే లాస్ట్ ఇయర్ డిసెంబర్ సెకండ్ వీక్ లోనే రిలీజ్ అవ్వాల్సింది కానీ వాయిదా పడింది.

ఈ ఇయర్ ఫిబ్రవరిలో తంగలాన్ రిలీజ్ అన్నారు అది మిస్సవ్వగా ఏప్రిల్ లో రిలీజ్ పక్కా అని అన్నారు. కానీ ఇప్పుడు తంగలాన్ రిలీజ్ పై డైరెక్టర్ కొత్త మాట చెబుతున్నారు. తంగలాన్ అంతా పూర్తయ్యి రిలీజ్ కు రెడీగా ఉంది. సినిమాను సెన్సార్ కు పంపించాల్సి ఉంది. తంగలాన్ సినిమా ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేద్దామనే ఆలోచన ఉందని. ఆఫ్టర్ ఎలక్షన్స్ సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు పా రంజిత్.

ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది అనుకున్న చియాన్ ఫ్యాన్స్ కు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది. విక్రం సినిమా రిలీజ్ డేట్ కన్ ఫ్యూజన్ వల్ల సినిమా మీద ఒకరమైన నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అయితే పా రంజిత్ మాత్రం తంగలాన్ ఎప్పుడొచ్చినా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని అంటున్నారు.

Also Read : Thalapathi Vijay : దళపతి సినిమాలో ఆ హీరోయిన్ కూడా..?

  Last Updated: 14 Mar 2024, 02:47 PM IST