Vikram Tangalaan : విక్రమ్ సినిమాలకే ఎందుకిలా జరుగుతుంది.. వాటి బాటలోనే తంగళాన్..!

కోలీవుడ్ లో అందరు హీరోలు తిరిగి ఫాం లోకి వచ్చినా చియాన్ విక్రం (Vikram) మాత్రం ఇంకా ప్రయత్నాలు

Published By: HashtagU Telugu Desk
Vikram Thangalaan Release Same Title In Telugu

Vikram Thangalaan Release Same Title In Telugu

కోలీవుడ్ లో అందరు హీరోలు తిరిగి ఫాం లోకి వచ్చినా చియాన్ విక్రం (Vikram) మాత్రం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రజినికాంత్, కమల్ హాసన్ తర్వాత సౌత్ అంతా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విక్రం ఇప్పుడు సరైన సక్సెస్ లు లేక కెరీర్ లో వెనకపడ్డాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన పి.ఎస్ 1, 2 సినిమాలు పర్వాలేదు అనిపించినా అతను సోలోగా కం బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలో పా రంజిత్ డైరెక్షన్ లో విక్రం తంగళాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విజువల్స్ అదిరిపోయాయి. సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా అంచనాలు పెంచింది. అయితే తంగళాన్ సినిమాతో విక్రం ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. అయితే తంగళాన్ సినిమా రిలీజ్ విషయంలో జరుగుతున్న జాప్యం మళ్లీ చియాన్ ఫ్యాన్స్ ని టెన్షన్ పడేలా చేస్తుంది.

తంగళాన్ సినిమా అసలైతే డిసెంబర్ లో రిలీజ్ అనుకున్నారు. అది కుదరకపోయేసరికి సంక్రాంతికి తెస్తారేమో చూశారు. కానీ ఇప్పుడు జనవరి 26న రిలీజ్ అంటున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం జనవరి 26కి కూడా తంగళాన్ రిలీజ్ అవుతుందని నమ్మకం చెప్పడం కష్టం అంటున్నారు. సినిమా రిలీజ్ విషయంలో హడావిడి చేయకుండా ప్రేక్షకులను మెప్పించేలా సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read : Animal OTT Release Date : యానిమల్ OTT రిలీజ్ డేట్ లాక్.. ఎందులో వస్తుంది అంటే..!

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 19 Dec 2023, 03:10 PM IST