Vijayashanthi : పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకొని బయటపడి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ భార్య అన్నా లెజనోవా ఇటీవల తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకొని, తలనీలాలు సమర్పించి, అన్నదానానికి భారీ విరాళం ఇచ్చి, స్వయంగా అన్నదానం చేసారు.
దీంతో వేరే మతంలో పుట్టినా మన హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ, ఒక తల్లి ప్రేమను కూడా చూపిస్తూ ఇలా చేయడం గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు. అయితే ఓ పార్టీకి సంబంధించిన నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో అన్నా లెజనోవాపై విమర్శలు చేస్తున్నారు. ఆడవాళ్లు గుండు కొట్టించకూడదని, ఆమె అన్యమతస్తురాలని విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే ఈ ట్రోల్స్ పై తాజాగా నటి, ఎమ్మెల్సీ విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఫైర్ అయ్యారు. విజయశాంతి తన ట్విట్టర్లో.. దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు అంటూ రాసుకొచ్చారు.
దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 15, 2025
Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ కి మొత్తం ఎన్ని కోట్ల లాస్ వచ్చిందో చెప్పేసిన తమన్..