Site icon HashtagU Telugu

Vijay : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌ని ఫాలో అవుతున్న విజయ్..? పాదయాత్రతో జనాల్లోకి..

Vijay wants to start his Political Journey with Padayatra

Vijay

Vijay : రాజకీయాల్లోకి సినిమా వాళ్ళు రావడం ఎప్పట్నుంచో జరుగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కొంతమంది సక్సెస్ అయితే, కొంతమంది ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ దాదాపు 10 ఏళ్ళు కష్టపడి ఇటీవలే సక్సెస్ అయి భారీ విజయం సాధించారు. ఇక తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా ఇటీవల అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చినట్టు ప్రకటించారు.

విజయ్ తన తమిళ వెట్రి కజగం పార్టీ ద్వారా 2026 తమిళనాడు(Tamilnadu) ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. అప్పటివరకు క్షేత్ర స్థాయిలో తన పార్టీని బలపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. విజయ్ కి అభిమాన సంఘాలు చాలా ఉన్నాయి. గతంలో ఆల్రెడీ కొంతమంది విజయ్ అభిమానులు గ్రామ, మండల స్థాయిలో ఎన్నికల్లో నిలబడి గెలిచారు. దీంతో విజయ్ సీరియస్ గానే ఎన్నికల్లోకి దిగుతున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల షూటింగ్ పూర్తిచేసి 2025 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగనున్నారు.

తాజాగా విజయ్ గురించి ఓ ఆసక్తికర విషయం తమిళ మీడియాలో చర్చగా మారింది. విజయ్ పాదయాత్రతో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల పాదయాత్ర బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత జగన్ కూడా పాదయాత్ర చేసి గెలిచాడు. ఇటీవల రాహుల్, దేశవ్యాప్తంగా పలువురు నాయకులు కూడా పాదయాత్ర చేశారు. పాదయాత్రతో సక్సెస్ రేట్ బాగుందని, జనాల్లోకి బాగా వెళ్లొచ్చని విజయ్ దీన్నే ఎంచుకున్నట్టు తెలుస్తుంది.

విజయ్ ఆల్రెడీ ఓ గుర్తు కోసం EC కి అప్లై చేసినట్టు తెలుస్తుంది. EC నుంచి క్లారిటీ రాగానే ఓ భారీ సభ పెట్టి తన పార్టీ జెండా, గుర్తు, విధివిధానాలను ప్రకటించి తమిళనాడులోని దాదాపు 100 స్థానాల్లో పాదయాత్ర చేస్తాడని విజయ్ అభిమాన సంఘాలు అంటున్నాయి. దీంతో విజయ్ 2026 తమిళనాడు ఎన్నికలను సీరియస్ గానే తీసుకున్నట్టు తెలుస్తుంది.

 

Also Read : Rajamouli : రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ తీస్తున్న డాక్యుమెంటరీ సిరీస్ ట్రైలర్ చూశారా?