Thalapathy 67: ‘మాస్టర్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్.. భారీ స్టార్ కాస్ట్ తో విజయ్ మూవీ!

మాస్టర్ (Master), వారిసు బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకున్న తర్వాత మూడవసారి దళపతి విజయ్

Published By: HashtagU Telugu Desk
Vijay

Vijay

7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ మీకు అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మాస్టర్ (Master), వారిసు బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకున్న తర్వాత మూడవసారి దళపతి విజయ్ (Thalapathy Vijay) సర్‌తో కలిసి పని చేయడం మాకు సంతోషంగా, గర్వంగా ఉంది. ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్‌కి ‘మాస్టర్’ క్రాఫ్ట్‌మ్యాన్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

‘’మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్ (Thalapathy Vijay), లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దళపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ (Thalapathy Vijay) తో కలసి పని చేస్తున్నారు.’దళపతి 67′ నటీనటులు, టీం కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ఎనౌన్స్ చేస్తారు.

టెక్నికల్ టీం :
డిఓపి – మనోజ్ పరమహంస, యాక్షన్ – అన్బరివ్, ఎడిటింగ్ – ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ – ఎన్. సతీస్ కుమార్, కొరియోగ్రఫీ – దినేష్, డైలాగ్ రైటర్స్ – లోకేష్ కనగరాజ్, రత్న కుమార్ & దీరజ్ వైది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాంకుమార్ బాలసుబ్రమణియన్.

Also Read: Samantha The Queen: సమంత ది క్వీన్.. లేటెస్ట్ పిక్ వైరల్!

  Last Updated: 31 Jan 2023, 04:10 PM IST