Sundeep Kishan : తమిళ్ స్టార్ హీరో విజయ్(Vijay) తనయుడు జాసన్ విజయ్(Jason Vijay) డైరెక్టర్ అవ్వబోతున్నారు అని తెలిసిందే. ఆల్రెడీ డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ చేసాడు, తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో జాసన్ విజయ్ దర్శకత్వంలో సినిమాని కూడా ప్రకటించారు. అయితే జాసన్ విజయ్ మొదటి సినిమా ఎవరితో తీస్తారు అనేది ఇంకా ప్రకటించలేదు.
తాజాగా తమిళ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. జాసన్ విజయ్ దర్శకుడిగా తన మొదటి సినిమా మన హీరో సందీప్ కిషన్ తో తీస్తాడని వార్తలు వస్తున్నాయి. సందీప్ కిషన్ తెలుగుతో పాటు ఎప్పట్నుంచో తమిళ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు. తమిళ్ మార్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇటీవల ధనుష్ రాయన్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించాడు. దీంతో సందీప్ కిషన్ కు తమిళ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే జాసన్ విజయ్ సందీప్ కిషన్ తో తన మొదటి సినిమా తీస్తాడని రూమర్లు వినిపిస్తున్నాయి. మరి అవి ఎంత వరకు నిజం అనేది వీళ్లల్లో ఎవరో ఒకరు స్పందిస్తే గాని క్లారిటీ రాదు.
Also Read : Jayam Ravi : విడాకుల లిస్ట్ లో మరో హీరో.. భార్యతో విడిపోయిన తమిళ హీరో..