Site icon HashtagU Telugu

Vijay Sethupathi : శేషారాయణం అలియాస్ విజయ్ సేతుపతికి అదిరిపోయే పాత్ర.. అదే జరిగితే మక్కల్ సెల్వన్ పేరు మారుమోగుతుంది..!

Vijay Sethupathi Telugu Movie News

Vijay Sethupathi Telugu Movie News

Vijay Sethupathi హనుమాన్ హిట్ అవ్వడంతో వెండితెర మీద రామాయణ మహాభారత కథలను తీసుకు రావాలనే ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి రామాయణ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రన్ బీర్ కపూర్ రామునిగా నటిస్తారని తెలుస్తుండగా సాయి పల్లవి సీత పాత్ర చేయనుంది. సినిమాలో రావణుడిగా కె.జి.ఎఫ్ యశ్ చేస్తారని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

అయితే ఈ సినిమాలో రావణుడి సోదరుడు విభీషణుడి పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తారని తెలుస్తుంది. సినిమాలో ఆ పాత్రకు విజయ్ సేతుపతిని అడిగితే ఆయన ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. రామాయణ కథలో విభీషణుడి పాత్ర అందరికీ తెలిసిందే. ఇటీవల వచ్చిన ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో కూడా ఆ పాత్రని చూపించారు.

రామాయణ్ లో విజయ్ సేతుపతి విభీషణుడి పాత్రలో నటించబోతున్నారట. తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో వర్సటాలిటీ చూపించే విజయ్ సేతుపతి కచ్చితంగా విభీషణుడిగా తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో రానున్నాయి. ఈ సినిమాతో పాటుగా మరో రామాయణం కూడా సౌత్ మేకర్స్ తీయాలని ఆలోచనలో ఉన్నట్టు టాక్.

Also Read : Deepika Padukone : దీపికా పదుకొనె మరో సౌత్ సినిమా.. ఈసారి ఆ స్టార్ తో రొమాన్స్..!