Site icon HashtagU Telugu

Vijay – Vishal : విజయ్ నో చెప్పాడు.. విశాల్ కెరీర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు..

Vijay says no to Pandem Kodi Vishal gets Career Biggest Hit with that Movie

Vijay says no to Pandem Kodi Vishal gets Career Biggest Hit with that Movie

ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం అనేది సర్వ సాధారణంగా జరుగుతుంది. ఒకరు కథ నచ్చక నో చెప్పడం, మరొకరు డేట్స్ సర్దుబాటుకాక చేయలేకపోవడం, మరికొందరు కథలో మార్పులు అడగడంతో ప్రాజెక్ట్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఈక్రమంలోనే తమిళ హీరో విజయ్(Vijay) కూడా ఒక బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నారు. ఆ సినిమాలో విశాల్(Vishal) నటించి కెరీర్ లో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇంతకీ అది ఏ సినిమా అంటే..?

విశాల్ అనగానే అటు తమిళ ఆడియన్స్‌కి, ఇటు తెలుగు ఆడియన్స్‌కి ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ‘పందెం కోడి'(Pandem Kodi). విశాల్ రెండో చిత్రంగా వచ్చిన ఈ సినిమా.. తనకి మాస్ హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. అంతేకాదు ఒకేసారి అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి గుర్తింపుని తీసుకు వచ్చింది. లింగుస్వామి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. అయితే ఈ కథని విశాల్ కంటే ముందు విజయ్ కి వినిపించారట. విజయ్, జ్యోతికలను హీరోహీరోయిన్లుగా పెట్టి లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు.

విజయ్ ని సంప్రదించి కథ కూడా వినిపించారట. అయితే విజయ్ సగం కథే విని నో చెప్పారట. సినిమాలోని కథానాయకుడి పాత్ర విజయ్ కి అంతగా నచ్చలేదట. సినిమా తొలి భాగంలో హీరో పాత్ర చాలా సైలెంట్ గా సాగుతుంది. అందుకే విజయ్ కి నచ్చి ఉండదు. అయినా సరే లింగుస్వామి మొత్తం కథ చెప్పడానికి ప్రయత్నించారట. కానీ విజయ్ సున్నితంగా తిరస్కరించరించి, మరో కథ ఉంటే చెప్పమని అడిగారట. దీంతో లింగుస్వామి అక్కడి వెనుదిరిగారు. ఆ తరువాత విశాల్ కి కథ వినిపించి ఓకే చేయించుకున్నారు.

 

మీరా జాస్మిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిచింది. 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో తమిళ్, తెలుగులో భారీ విజయం సాధించింది. అలా విజయ్ ఒక మంచి హిట్ సినిమా మిస్ అయితే విశాల్ దాన్ని కెరీర్ హిట్ చేసుకున్నాడు. 2018లో ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కూడా లింగుస్వామే డైరెక్ట్ చేశారు. మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సీక్వెల్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సీక్వెల్ యావరేజ్ గా నిలిచింది.

 

Also Read : Hanuman : అదరగొడుతున్న హనుమాన్.. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ.. నాలుగు రోజుల్లోనే..