Site icon HashtagU Telugu

Thuppakki : అక్షయ్ కుమార్ చేయాల్సిన మూవీ విజయ్ చేశాడు.. తరువాత రీమేక్..

Vijay Replaced Akshay Kumar Place in AR MurugadasThuppakki Movie

Vijay Replaced Akshay Kumar Place in AR MurugadasThuppakki Movie

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్(AR Murugadas), ఇళయ దళపతి విజయ్ (Vijay) కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ ‘తుపాకీ'(Thuppakki). కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్‌గా, విద్యుత్‌ జమ్వాల్‌ విలన్‌గా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యి బెస్ట్ డబ్బింగ్ ఫిలిమ్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమాని బాలీవుడ్ హీరో ‘అక్షయ్ కుమార్’ (Akshay Kumar) తో చేయాల్సి ఉంది. అక్షయ్ స్టోరీ ఒకే చేసి అగ్రిమెంట్ కూడా చేసుకున్న తరువాత సడన్ గా విజయ్ ఎంట్రీ ఇచ్చాడు.

మురుగదాస్ ఈ సినిమాని అక్షయ్ కుమార్ హీరోగా.. తమిళ్, హిందీలో బై లింగువల్ గా తెరకెక్కించాలని అనుకున్నాడు. ఈక్రమంలోనే అక్షయ్ ని కలిసి కథ కూడా వినిపించాడు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ గా వినిపించిన మురుగదాస్.. సెకండ్ హాఫ్ మాత్రం జస్ట్ లైన్ చెప్పాడు. ఇక ఓవరాల్ గా కథ నచ్చడంతో అక్షయ్, మురుగదాస్ తో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. సెకండ్ హాఫ్ కంప్లీట్ అవ్వగానే డేట్స్ లాక్ చేసుకుందామని అగ్రిమెంట్ పై సైన్ చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం అంతా మురుగదాస్ ‘సెవెంత్ సెన్స్’ (7th Sense) మూవీ తెరకెక్కిస్తున్న సమయంలో జరిగింది.

ఆ మూవీ షూటింగ్ ఎండింగ్ లో ఉండగా మురుగదాస్ కి విజయ్ ఫాదర్ ఎస్ ఏ చంద్రశేఖర్ నుంచి కాల్ వచ్చింది. మణిరత్నంతో విజయ్ చేయాల్సిన సినిమా డ్రాప్ అయ్యింది. ఇప్పుడు విజయ్ డేట్స్ ఖాళీగా ఉన్నాయి. తనతో సినిమా చేయమని చెప్పారు. అలా విజయ్ చేతులోకి ‘తుపాకీ’ సినిమా వచ్చింది. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ సినిమాని చేయాల్సిన అక్షయ్ కుమార్.. రెండేళ్ల తరువాత ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని కూడా మురుగదాసే డైరెక్ట్ చేశాడు. ‘హాలిడే’ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

 

Also Read : Yatra 2 : జగన్ బయోపిక్ యాత్ర 2 మొదలైంది.. షూటింగ్ వీడియో వైరల్.. జగన్ పాత్రలో..