Vijay devarakonda – Rashmika : విజయ్- రష్మికలు మరోసారి మీడియాకు అడ్డంగా దొరికేశారు

వీరు ఒకే లొకేషన్ లో వేరువేరుగా దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టర్కీలో విహారయాత్రలో ఉన్న రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది

Published By: HashtagU Telugu Desk
vijay devarakonda & rashmika in Turkey

vijay devarakonda & rashmika in Turkey

విజయ్ దేవరకొండ – రష్మిక లు మరోసారి మీడియా కు అడ్డంగా దొరికిపోయారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రష్మిక (Rashmika)..ఈ జంట అంటే అభిమానులకే కాదు సినీ లవర్స్ కు సైతం ఎంతో ఇష్టం. గీత గోవిందం (Geetha Govindam) మూవీ లో జంటగా నటించిన..వీరు ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీ లో నటించారు. మొదటి సినిమా నుండే వీరి మధ్య స్నేహం బలపడింది. ఆ తర్వాత నుండి అలాగే కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య ఉంది స్నేహం కాదు ప్రేమ అని చాలామంది అంటుంటారు. దీనికి కారణం వీరిద్దరూ కలిసి టూర్స్ కు వెళ్లడం..ప్రవైట్ గా కలుసుకోవడం వంటివి చేయడం తో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అంత కామెంట్స్ వేస్తుంటారు. పలు మీడియా సమావేశాల్లో కూడా ఈ ప్రస్తావనను వారి ముందుకు తీసుకురాగా..లేదు లేదు మీము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా వీరు ఒకే లొకేషన్ లో వేరువేరుగా దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టర్కీలో విహారయాత్రలో ఉన్న రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో టర్కీకి చెందినదిగా తెలుస్తోంది. ఇక అక్కడ విజయ్ దేవరకొండ తన ఇటీవల విడుదలైన ఖుషి సినిమా చిత్రీకరణలో పాల్గొన్న విషయం తెలిసిందే. దీనితో రష్మిక కూడా ఆ సమయంలో ఆ ప్లేస్ కి వచ్చిందని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే రష్మిక పోస్ట్ చేసిన ఫోటో.. విజయ్ దేవరకొండ కూర్చున్న టేబుల్ ఫోటో.. ఒకే విధంగా ఉండటం… అభిమానులు గమనించారు. దీంతో ఆ ఫోటోలను నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరు తమ పేమను బయటకు చెప్పకపోయినా..వీరి ప్రవర్తన..టూర్స్ చూస్తే ఎవరికైనా వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని అర్ధం అవుతుంది. చూద్దాం ఎన్ని రోజులు ఇలా దాచుకుంటారో..

Read Also : Pawan Kalyan : తిరుపతి నుండి జనసేనాని పోటీ..?

  Last Updated: 09 Oct 2023, 08:29 AM IST