Site icon HashtagU Telugu

Vijay: పొలిటికల్ ఎంట్రీపై స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

Vijay

Vijay

దళపతి విజయ్…తమిళ ప్రేక్షకులు తలైవా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఈ స్టార్ హీరోకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ…రాజకీయ అడుగులు వేసే విజయ్…రాజకీయల్లోకి రావాలని ఆయన తల్లిదండ్రులు, అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. విజయ్ తండ్రి ఆయన పేరుతో పార్టీ పెట్టారు. అభిమానులు కూడా విజయ్ పేరుతో ఆ అసోసియేషన్ పెట్టి దాని పేరుమీద స్థానిక ఎన్నికల్లోనూ పోటీచేశారు.

విజయ్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో విజయ్ తాజాగా చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాను నాయకుడిగా అవతరించడం తన చేతిలో లేదని …కాలం చేతుల్లో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నానని…ఈ పయనాన్ని కాలంతోపాటుగా అభిమానులే నిర్ణయించాలంటూ ఆయన స్పష్టం చేశారు. కాగా విజయ్ నటించిన మూవీ బీస్ట్ రిలీజ్ సిద్ధమైంది. విజయ్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నెల్సన్ డైరెక్షన్ లో ఈ మూవీ రూపొందింది. ఈనెల 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా తన మనసులో మాటను బయట పెట్టారు విజయ్. విజయ్ మాటలు రాజకీయ చర్చకు దారితీసాయి.

ఇక తన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ తో ఉన్న విభేదాలపై విజయ్ క్లారిటీ ఇచ్చారు. చెట్టుకు వేర్లు ఎలానో…ఓ తండ్రి కుటుంబానికి అలాగే అని…దేవుడు కనిపించడు…తండ్రి కనిస్తాడని సమాధానమిచ్చాడు. ఇక తన కుమారుడు సంజయ్ సినీరంగ ప్రవేశంపై విజయ్ స్పందించారు. సంజయ్ సినిమాల్లోకి వస్తాడా …రాడా అనేది తెలియదన్నాడు. తన ఇష్టాన్ని బట్టిం ఉంటుందని విజయ్ సమాధానిమిచ్చాడు. ఇక విజయ్ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో అతను రాజకీయ ప్రవేశం చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

https://twitter.com/AparnaDasOffI/status/1510623569960574979