Site icon HashtagU Telugu

Leo Trailer: లియో ట్రైలర్ భీభత్సం.. థియేటర్ ని నాశనం చేసిన ఫ్యాన్స్

Lio Trailer

Lio Trailer

Leo Trailer: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమాలో విజయ్, త్రిష, సంజయ్ దత్ లుక్ ఆకట్టుకోగా, ఎలివేషన్స్, మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. లియో సినిమా ఈనెల 19న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులకు లియో ట్రైలర్ ఐ ఫీస్ట్ లా మారింది, హీరో విజయ్ పూర్తి యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ సాగింది. సినిమా ట్రైలర్ ని అద్భుతంగ కట్ చేశాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.

లియో ట్రైలర్ ని చెన్నైలోని రోహిణి థియేటర్లో ప్రదర్శించారు. ట్రైలర్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు థియేటర్‌కి చేరుకున్నారు. ట్రైలర్ చూసే ఉత్సాహంతో అభిమానులు థియేటర్‌లోని సీట్లను చింపి చెల్లాచెదురు చేశారు. థియేటర్లో రచ్చరచ్చ చేస్తూ భీభత్సం సృష్టించారు. కుర్చీలను విసురుతూ నానా రభస చేశారు. దీనికి సంబందించిన ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. .

లియో చిత్రంలో దళపతి విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిష్కిన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, శాండీ, జనని, అభిరామి వెంకటాచలం, బాబు ఆంటోని తదితరులు నటిస్తున్నారు.

Also Read: JIO OTT Plans: ఓటిటి వినియోగదారుల కోసం JIO కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు