Vijay Deverakonda : VD12 మూవీ స్టోరీ ఆ పాయింట్‌తో రాబోతోందా..!

VD12 మూవీ శ్రీలంక తమిళియన్స్ సివిల్ వార్ నేపథ్యంతో రాబోతోందా. 1983 నుంచి 2009 వరకు..

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 11:49 AM IST

Vijay Deverakonda : ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ తరువాత విజయ్ దేవరకొండ తన VD12 సినిమాని స్టార్ట్ చేయనున్నారు. నిజానికి ఫ్యామిలీ స్టార్ కంటే ముందే VD12 షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. కానీ ఈ మూవీ భారీ ప్రాజెక్ట్ కావడం, షూటింగ్ కూడా ఎక్కువ డేస్ కావాల్సి ఉండడంతో.. ఫ్యామిలీ స్టార్ ని ముందుగా పూర్తి చేసారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి VD12ని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

కాగా ఈ మూవీ గురించి విజయ్ రీసెంట్ గా ఆసక్తికర కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో ఉన్న విజయ్, VD12 గురించి మాట్లాడుతూ.. “తమిళనాడు, శ్రీలంక నేపథ్యంతో ఈ సినిమా ఉండబోతుందని, అందుకనే సినిమాలో తమిళ్ నటీనటులు ఎక్కువ మంది కనిపిస్తారని” చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ విన్న తరువాత VD12 మూవీ శ్రీలంక తమిళియన్స్ సివిల్ వార్ నేపథ్యంతో రాబోతోందా అనే సందేహం కలుగుతుంది.

1983 నుంచి 2009 వరకు జరుగుతూనే వచ్చిన ఈ అంతర్గత యుద్ధంలో ఎంతోమంది తమిళ మరియు శ్రీలంక అమాయక ప్రజలు చనిపోయారు. ఈ సివిల్ వార్ చుట్టూ ఎన్నో కథలు ఉన్నాయి. ఆ కథలు ఇండియన్ అండ్ శ్రీలంకతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు వాటిలోని ఓ కథతోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ పాయింట్ తో మణిరత్నం ‘అమృత’ అనే సినిమా చేసారు. రీసెంట్ గా సమంత నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ కూడా ఇదే పాయింట్ తో వచ్చింది.

మరి VD12 నిజంగానే శ్రీలంక తమిళియన్స్ సివిల్ వార్ నేపథ్యంతో వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

Also read : Indian 2 : కమల్ ఇండియన్ 2కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందట.. ఎప్పుడంటే..!