Vijay Deverakonda : విజయ్ దేవరకొండ పీరియాడిక్ డ్రామా.. టైటిల్ ఏంటో తెలుసా..?

దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ పీరియాడిక్ డ్రామా మూవీ. దర్శకుడు, టైటిల్ ఏంటో తెలుసా..?

Published By: HashtagU Telugu Desk
Vijay Deverakonda Dil Raju New Movie Titled As Rowdy Janardhan

Vijay Deverakonda Dil Raju New Movie Titled As Rowdy Janardhan

Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. అయినాసరి విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. గీతగోవిందం సినిమా తరువాత విజయ్ కి మళ్ళీ ఆ స్థాయి విజయం ఒక్కటి పడలేదు. మధ్యలో వచ్చిన టాక్సీవాలా, ఖుషి సినిమాలు పర్వాలేదు అనిపిస్తే.. మిగిలిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. థియేటర్స్ లో సత్తా చాటలేకపోయింది.

అయినాసరి విజయ్ తో సినిమా చేసేందుకు నిర్మాతలు మాత్రం సై అంటూనే ఉంటున్నారు. ఫ్యామిలీ స్టార్ తో దెబ్బతిన్న తరువాత కూడా దిల్ రాజు.. విజయ్ తో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అది కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని తెలుస్తుంది. ‘రాజా వారు రాణి గారు’ వంటి హిట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు రవి కిరణ్ కోలా.. విజయ్ తో తన రెండో సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారు.

ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతుందట. ఇక ఈ చిత్రానికి ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ ని ఖరారు చేశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ ని చూసిన రౌడీ ఫ్యాన్స్.. టైటిల్ బాగుందంటూ కంప్లిమెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. విజయ్ బర్త్ డే (మే 9) నాడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో విజయ్, దిల్ రాజుకి హిట్ ఇస్తాడా లేదా చూడాలి.

కాగా విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతుంది. విజయ్ ఈ సినిమాతో భారీ కమ్‌బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Also read : Nikhil Siddhartha : జనసేన జెండా పట్టిన హీరో నిఖిల్.. వీడియో వైరల్..

  Last Updated: 29 Apr 2024, 11:59 AM IST