Site icon HashtagU Telugu

VijayDevarakonda : ఎట్టకేలకు క్షేమపణలు చెప్పిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda

Vijay Devarakonda

యంగ్ హీరో విజయ్ దేవరకొండ (VijayDevarakonda) ఇటీవల ‘రెట్రో’ ప్రీ రిలీజ్ కార్యక్రమం(Retro Prerelease)లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. కొన్ని వర్గాలవారిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు చాలా మందిని కలచివేసాయి. ఈ నేపథ్యంలో విజయ్‌పై విమర్శలు వెల్లువెత్తగా, ఆయన చివరికి స్పందించి క్షమాపణలు తెలిపారు. తన మాటలు అర్ధం తప్పుగా బయటకు వెళ్లాయని, తాను ఎవరినీ అవమానించాలన్న ఉద్దేశంతో అనలేదని స్పష్టం చేశారు.

Police Vehicles Vs Challans : పోలీసు వాహనాలపై 17,391 పెండింగ్‌ ఛలాన్లు.. అర కోటికిపైనే బకాయీ

“నాకు ఎస్టీ వర్గాల పట్ల అపారమైన గౌరవం ఉంది. వందల సంవత్సరాల క్రితం మనుషులు తెగలుగా విడిపోయిన పరిస్థితిని గురించి మాత్రమే మాట్లాడాను. కానీ అది కొన్ని వర్గాలపై వ్యక్తిగత వ్యాఖ్యలుగా అర్థం చేసుకున్నారు. ఇది నన్ను బాధించింది. ఆ వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే నిజంగా క్షమాపణలు చెబుతున్నాను” అని తెలిపారు.

విజయ్ వివరణ అనంతరం సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది ఆయన క్షమాపణలను స్వాగతిస్తుండగా, మరికొందరు జాగ్రత్తగా మాట్లాడాల్సిందని సూచిస్తున్నారు. ఏదేమైనా విజయ్ రెస్పాండ్ అవ్వడం తో ఈ వివాదానికి తెరపడిందని భావించవచ్చు.