సంగీత్ వేడుకలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన సందడి

Virosh Wedding  టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా తమ సంగీత్ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి వివాహం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లికి రెండు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 24న ఇదే హోటల్‌లో సంగీత్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ […]

Published By: HashtagU Telugu Desk
Vijay Rashmika Sangeet ceremony

Vijay Rashmika Sangeet ceremony

Virosh Wedding  టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా తమ సంగీత్ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి వివాహం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లికి రెండు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 24న ఇదే హోటల్‌లో సంగీత్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

సంగీత్ వేడుక కోసం విజయ్, రష్మిక ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రముఖ డిజైనర్లు ఫల్గుణి షేన్ పీకాక్ ఇండియా రూపొందించిన అవుట్‌ఫిట్స్‌లో ఈ జంట రాజకుమారుడు, రాజకుమారిలా కనిపించారు. రష్మిక సిల్వర్ కలర్ లెహంగాలో మెరవగా, విజయ్ నల్లటి దుస్తులపై రాళ్లు పొదిగిన డిజైన్‌తో ఆకట్టుకున్నారు. ఇద్దరూ పొడవాటి కేప్ ధరించి తమ లుక్స్‌కు రాయల్ టచ్ ఇచ్చారు. పంచుకున్న ఫోటోలలో ఇరు కుటుంబాల మధ్య ఉన్న ప్రేమ, బంధం స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్ తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్, రష్మిక తల్లిదండ్రులు, చెల్లెలు షిమాన్ మందనతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుక గురించి రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “ప్రేమ, ఆనందబాష్పాలు, నవ్వులు, సంగీతం, పాటలు, గ్లిట్టర్స్‌తో నిండిన రాత్రి అది. మేమిద్దరం ఒకరినొకరం సర్‌ప్రైజ్ చేసుకోవాలనుకున్నాం. మా కుటుంబసభ్యులు మమ్మల్ని సర్‌ప్రైజ్ చేయాలనుకున్నారు. వాళ్లంతా అంత స్వేచ్ఛగా, అద్భుతంగా డ్యాన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోయాం. ఫల్గుణి షేన్ పీకాక్ డిజైన్ చేసిన డ్రెస్ చాలా బరువుగా ఉన్నా, రాత్రంతా అందులోనే ఉన్నాను. ఫిబ్రవరి 24, 2026.. ఆ రాత్రి విజయ్, నేను మా కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రేమ మధ్య ఒక్కటై డ్యాన్స్ చేశాం” అని రాసుకొచ్చారు.

విజయ్ దేవరకొండ కూడా ఈ వేడుకను గుర్తుచేసుకుంటూ… “కళ్లలో నీళ్లు తిరిగేంతగా నవ్వుకున్నాం. పాదాలు నొప్పి పెట్టేంత వరకు డ్యాన్స్ చేశాం. అందరి ప్రసంగాలు, సర్‌ప్రైజ్‌లతో భావోద్వేగాలను ఆపుకోలేక కళ్లు చెమ్మగిల్లాయి. అందమైన మనుషులతో నిండిన ఒక పెద్ద సంతోషకరమైన పార్టీ అది. తెల్లవారుజాము 4 గంటల వరకు అదే దుస్తుల్లో ఉన్నాను” అని పోస్ట్ చేశారు. ఈ పోస్టులు, ఫొటోలు చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 03 Mar 2026, 12:36 PM IST