Vijay – Rashmika Tweets : ట్విట్టర్ లో రెచ్చిపోయిన విజయ్ – రష్మిక..

థాంక్యూ విజయ్ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్

Published By: HashtagU Telugu Desk
Vijay Rashmika

Vijay Rashmika

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రష్మిక (Rashmika)..ఈ జంట అంటే అభిమానులకే కాదు సినీ లవర్స్ కు సైతం ఎంతో ఇష్టం. గీత గోవిందం (Geetha Govindam) మూవీ లో జంటగా నటించిన..వీరు ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీ లో నటించారు. మొదటి సినిమా నుండే వీరి మధ్య స్నేహం బలపడింది. ఆ తర్వాత నుండి అలాగే కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య ఉంది స్నేహం కాదు ప్రేమ అని చాలామంది అంటుంటారు. దీనికి కారణం వీరిద్దరూ కలిసి టూర్స్ కు వెళ్లడం..ప్రవైట్ గా కలుసుకోవడం వంటివి చేయడం తో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అంత భావిస్తుంటారు.

Read Also : Biryani : బిర్యానీ లో జెర్రీ ని చూసి పరుగులు పెట్టిన కస్టమర్..ఎక్కడో తెలుసా..?

తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చారు ఈ జంట. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘యానిమల్’ (Animal). అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి రణబీర్ (Ranabir) పుట్టిన రోజు సందర్బంగా గురువారం ఫస్ట్ లుక్ టీజర్ (Animal Teaser) ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా టీజర్ ని ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ‘యానిమల్’ టీజర్ తనకు ఎంతో నచ్చిందని అన్నాడు.” మై డార్లింగ్స్ సందీప్ రెడ్డి వంగ, రష్మిక అలాగే నాకెంతో ఇష్టమైన నటుడు రణబీర్ కపూర్ కు ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్ డే” అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై రష్మిక స్పందించింది.” థాంక్యూ విజయ్ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్” అని రిప్లై ఇచ్చింది. దీంతో వీళ్ళ ట్వీట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జోడి పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘మీరు ఎప్పటికీ బెస్ట్ ఫెయిర్’ అని సోషల్ మీడియాలో వరస పోస్టులు పెడుతున్నారు. మొత్తం మీద మరోసారి విజయ్ – రష్మిక వార్తల్లో హైలైట్ అవుతున్నారు.

  Last Updated: 29 Sep 2023, 06:49 PM IST