Site icon HashtagU Telugu

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అలాంటి కథలకు నో చెబుతున్నాడా.. ఎందుకలా చేస్తున్నాడు..?

Vijay Devarakonda Gautham Tinnanuri Another KGF Loading

Vijay Devarakonda Gautham Tinnanuri Another KGF Loading

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరితో స్పై థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. అయితే ఈమధ్య ఓ డైరెక్టర్ ఒక మాస్ మసాలా సినిమా తో తనని సంప్రదించారని తెలుస్తుంది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఆ కథను కాదనేశాడట.

We’re now on WhatsApp : Click to Join

ఇదంతా కూడా విజయ్ కి లైగర్ ఇచ్చిన షాక్ వల్లే అని అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా మారింది.

ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ చాలా అప్సెట్ అయ్యాడు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమా నిరాశ పరచడంతో ఇక మీదట ఇలాంటి రిస్క్ లు చేయొద్దని విజయ్ అనుకుంటున్నాడు. అందుకే పూరీతో జన గణ మన సినిమా అనౌన్స్ చేసి మరీ అది క్యాన్సిల్ చేసుకున్నాడు. గీతా గోవిందం తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ ఏది అందుకోలేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఖుషి కూడా ఏదో అలా సాగిపోయింది.

తన కోసం డిఫరెంట్ స్టోరీస్ తీసుకు రమ్మని డైరెక్టర్స్, రైటర్స్ తో చెబుతున్నాడట విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ పరశురాం మీద ఉన్న కాన్ ఫిడెంట్ తో చేస్తున్నాడు. ఆ సినిమా కచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుందని నమ్ముతున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించడం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

Also Read : Niharika Konidela Re Entry : మెగా డాటర్ నిహారిక రీ ఎంట్రీ ఫిక్స్.. కంబ్యాక్ ఈ రేంజ్ లో ఉండబోతుందా..?