Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ ఖుషి కమర్షియల్ గా సక్సెస్ అయ్యిందా లేదా అన్న విషయం పక్కన పెడితే విజయ్ కి మాత్రం ఖుషి కొంత రిలీఫ్ ఇచ్చిందని తెలుస్తుంది. ఖుషి తర్వాత పరశురాం డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో విజయ్ మృనాల్ ల సీన్స్ చాలా బాగా వచ్చాయని తెలుస్తుంది.
గీతా గోవిందం (Geetha Govindam) తర్వాత పరశురాం తో విజయ్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి బరికి తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో మహేష్ గుంటూరు కారం రవితేజ ఈగల్, వెంకటేష్ సైంధవ్ సినిమాలు ఉన్నాయి. వాటితో పాటుగా నాగార్జున నా సామిరంగ కూడా వస్తుంది.
Also Read : NTR : దేవర నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!
ఈ సినిమాల మధ్యలో విజయ్ (Vijay) సినిమా రావడం రిస్క్ అని చెప్పొచ్చు. అయితే నిర్మాత దిల్ రాజు కాబట్టి ఎప్పుడొచ్చినా థియేటర్ల సమస్య ఉండదు. అందుకే విజయ్ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబో సినిమా రాబోతుంది. జెర్సీ తర్వాత గౌతం భారీ రేంజ్ లో విజయ్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమా కేవలం తెలుగు వరకే రిలీజైనా గౌతం తిన్ననూరి సినిమా మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో భారీగా ఉంటుందని తెలుస్తుంది. విజయ్ ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాతే నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ ఉంటుందని తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join