టాలీవుడ్‌లో హిట్ జోడీగా పేరుపొందిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా మళ్లీ స్క్రీన్‌ను షేర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న “కింగ్డమ్” అనే భారీ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉండగా, దాని తర్వాత విజయ్ మరొక కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఈసారి విజయ్, ట్యాక్సీవాలా సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తో మళ్లీ కలసి పనిచేయబోతున్నాడు. ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న ఈ రెండవ సినిమా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కథకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా, ఈ సినిమా మీద ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది.
Weekly Horoscope : వారఫలాలు.. మే 5 నుంచి మే 11 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో హింట్ ఇవ్వడంతో ఆమె భాగస్వామ్యంపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. విజయ్-రష్మిక కలయిక గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాల్లో అలరించింది. మళ్లీ ఈ హిట్ జోడీ తెరపై కనపడబోతుందని తెలిసి అభిమానుల్లో ఆనందం నెలకొంది. అధికారిక ప్రకటన రాగానే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.