Site icon HashtagU Telugu

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ పక్కన పూజా హగ్దే ..మాములుగా లేదుగా ..!!

Vijay Pooja

Vijay Pooja

ఫ్యామిలీ స్టార్ (Family Star) గా రాబోతున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పక్కన బుట్టబొమ్మ పూజా హగ్దే (Pooja Hegde) అదిరిపోయే స్టెప్స్ వేసి అదరగొట్టింది. పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం సినిమాలతో యూత్ స్టార్ గా మారిన విజయ్..ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ఆ మధ్య వచ్చిన లైగర్ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. పూరి – విజయ్ కలయికలో ఈ సినిమా రావడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు..కానీ ఈ మూవీ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ గా రాబోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులోని ‘ఐరనే వంచాలా ఏంటి’ అన్న డైలాగ్ నెట్టింట ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తుండటం వల్ల ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మరింతగా ఎదురుచూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఈ మూవీ నుంచి నంద నందనా అనే సాంగ్​ను మేకర్స్ విడుదల చేశారు. క్యాచీ లైన్స్​తో ఆకట్టుకుంటున్న ఈ మెలోడీ యూత్​ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఇదే సాంగ్​కు విజయ్‌ దేవరకొండ, బుట్టబొమ్మ పూజా హెగ్డే కలిసి స్టెప్పులేశారు. ఓ కాలేజ్‌లో నిర్వహించిన ఆర్ట్‌ ఫెస్టివల్‌లో ఈ ఇద్దరూ సందడి చేశారు. ఫెస్ట్​లో భాగంగా ఈ పాటకు డ్యాన్స్​ చేసి స్టూడెంట్స్​ను అలరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేజ్ ఫై ఈ ఇద్దరి జోడి చూసిన ఫ్యాన్స్..వీరి కలయికలో సినిమా వస్తే బాగుండని కోరుకుంటున్నారు.

Read Also : Regina : పెళ్లి పీటలు ఎక్కబోతున్న రెజీనా..?