Site icon HashtagU Telugu

Vijay Devarakonda : దేవరకొండ మారిపోతున్నాడా.. ఫ్యాన్స్ కి కిక్కే కిక్కు..!

Vijay Devarakonda Missed Four Super Hit Movies

Vijay Devarakonda Missed Four Super Hit Movies

Vijay Devarakonda ఫ్యామిలీ స్టార్ అంటూ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో ఊహించని డిజాస్టర్ మూట కట్టుకున్నాడు. పరశురాం తో గీతా గోవిందం లాంటి మరో సూపర్ హిట్ పడుతుందని ఆశించిన విజయ్ కు ఫ్యామిలీ స్టార్ పెద్ద షాకే ఇచ్చింది. ఈ సినిమాలో లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించినా సరే అదృష్టం కలిసి రాలేదు.

దిల్ రాజు నిర్మాణం లో దాదాపు పాతిక కోట్ల పైన బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా ఫెయిల్యూర్ తో కొద్దిపాటి గ్యాప్ తీసుకోవాలని అనుకున్న విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా కోసం మరింత జాగ్రత్త పడుతున్నాడు. విజయ్ దేవరకొండ 12వ సినిమా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో వస్తుంది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. విజయ్ ఈమధ్య అన్ని సినిమాల్లో ఒకేలా కనిపిస్తున్నాడు. అందుకే గౌతం తిన్ననూరి సినిమాలో డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడట.

ఈ సినిమాలో విజయ్ లుక్ మాత్రమే కాదు తన క్యారెక్టరైజేషన్ కూడా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుందని అంటున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు నటించే ఛాన్స్ ఉందని టాక్. అయితే అందులో ఒకరు మిస్టర్ బచ్చన్ భామ భాగ్య శ్రీకి ఛాన్స్ ఇవ్వగా మరో హీరోయిన్ ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Also Read : Nayanatara Premalu : స్టార్ హీరోయిన్ ను మెప్పించిన ప్రేమలు మూవీ.. సోషల్ మీడియాలో ఏం కామెంట్ పెట్టిందంటే..!