Site icon HashtagU Telugu

Family Star Madhuramu Kada Song : మధురము కదా సాంగ్.. ఫ్యామిలీ స్టార్ చిన్నగా ఎక్కించేస్తున్నాడు..!

Vijay Devarakonda Mrunal Thakur Family Star Madhuramu Kada Song Released

Vijay Devarakonda Mrunal Thakur Family Star Madhuramu Kada Song Released

Family Star Madhuramu Kada Song విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న క్రేజీ మూవీ ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ గీతా గోవిందం తో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ పరశురాం మళ్లీ కలిసి చేస్తున్న ఈ ఫ్యామిలీ స్టార్ తో కూడా హిట్ టార్గెట్ పెట్టుకున్నారు.

ఈ సినిమాలో లక్కీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించడం కూడా హైప్ తెచ్చుకునేలా చేసింది. ఈ సినిమాలో గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తుండగా ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ ప్రేక్షకాదరణ పొందాయి.

Also Read : Tripti Dimri : యానిమల్ బ్యూటీపై మనసు పడ్డ నటుడు.. డేటింగ్ చేయాలని ఉందంటూ..!

లేటెస్ట్ గా సినిమా నుంచి మరో సాంగ్ రిలీజైంది. మధురమే కదా అంటూ వచ్చిన ఈ సాంగ్ కూడా శ్రోతలను అలరిస్తుంది. శ్రీమనీ రచించిన ఈ పాటను శ్రేయా ఘోషల్ ఆలపించారు. గోపీ సుందర్ తన బలమైన మెలోడీ ట్యూన్ తో మరోసారి సూపర్ అనిపించాడు. పరశురాం గోపీ సుందర్ (Gopi Sundar) కాంబో మంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ఫ్యామిలీ స్టార్ తో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మృణాల్ ఠాకూర్ జోడీ కూడా సినిమాకు మరో హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. సినిమా నుంచి వచ్చిన టీజర్ మెప్పించగా మార్చి 28న ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఈ సినిమాపై దిల్ రాజు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రిలీజైన 3 సాంగ్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేయగా ఫ్యామిలీ స్టార్ సినిమా చిన్నగా ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడని చెప్పొచ్చు.