Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది. అదీగాక పరశురాం తో విజయ్ దేవరకొండ ఆల్రెడీ గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఫ్యామిలీ స్టార్ (Family Star) ఫస్ట్ గ్లింప్స్ చూస్తే విజయ్ దేవరకొండ కూడా గేర్ మార్చాడని అనిపిస్తుంది. ఇన్నాళ్లు యూత్ ఫుల్ సినిమాలు చేసిన విజయ్ గేర్ మార్చి ఈ సినిమాతో మాస్ అప్పీల్ చేస్తున్నాడు. అందుకే ఫస్ట్ గ్లింప్స్ తోనే షాక్ ఇచ్చాడు. ఫ్యామిలీ స్టార్ మాస్ అండ్ క్లాస్ మిక్స్ గా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మాస్ హీరోగా కూడా మారే అవకాశం ఉంది. విజయ్ ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీ స్టార్ టీజర్ (Family Star Teaser)తో ఫుల్ ఖుషి అవుతున్నారు. విజయ్ పర్సనాలిటీకి తగిన కథ పడిందని అంటున్నారు. సర్కారు వారి పాట తర్వాత విజయ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న పరశురాం హిట్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది.
దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్టే లెక్క. ఫ్యామిలీ స్టార్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఆల్రెడీ సంక్రాంతికి మహేష్, వెంకటేష్, రవితేజ సినిమాలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ పొంగల్ ఫైట్ లో గెలుస్తాడా లేదా అన్నది చూడాలి.
Also Read : Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ బీ రెడీ.. రెండు పండుగలు ఒకేసారి..!