విజయ్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom ) జూలై 31న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో, సినీ ప్రముఖులలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలకు వారం ముందు, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) ‘కింగ్‌డమ్’ను చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన స్పందన సినిమా టీమ్‌కు ఉత్సాహాన్నిచ్చేలా ఉంది.
పాడ్‌కాస్ట్ సందర్భంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, హీరో విజయ్ దేవరకొండతో కలిసి మాట్లాడిన సందీప్ రెడ్డి.. “మీ చేతుల్లో ఒక సూపర్ హిట్ ఉంది” అంటూ నిశ్చయంగా చెప్పారు. సినిమాలోని కొన్ని విజువల్స్ తనకు చూపించారని, అవి చాలా బాగా ఉన్నాయని పేర్కొన్నారు. నటన, యాక్షన్ ఎలిమెంట్స్, విజువల్ టోన్ అన్నీ బాగా ఉన్నాయని, పక్కా హిట్ టాక్ వస్తుందన్నారు. ఇంకా సినిమా మొత్తం చూడకపోయినా, నేపథ్య సంగీతం లేకపోయినా కూడా కథ, విజువల్స్ తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు కలిస్తే సినిమాకు మరో స్థాయి అద్భుతత చేరుతుందని పేర్కొన్నారు.
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో లోపాలు.. ఇకపై మ్యాచ్‌లు బంద్?!
‘కింగ్‌డమ్’ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, సత్యదేవ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. తెలుగు తో పాటు తమిళంలోనూ విడుదలవుతున్న ఈ చిత్రానికి విజయ్ డబ్బింగ్‌ను నటుడు సూర్య అందించడం విశేషం. మొత్తం మీద ‘కింగ్‌డమ్’పై హైప్ నెలకొన్న తరుణంలో సందీప్ వంగా చెప్పిన కామెంట్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తుంది.