Bhadrakali : విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘భద్రకాళి’ విడుదల తేదీ ఖరారైంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో విడుదల చేయబోతోంది. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు బుధవారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సురేష్ బాబు మాట్లాడుతూ – “విజయ్ ఆంటోనీ ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. భద్రకాళి కూడా ఆ లైన్‌లోనే ఉంటుంది. చిత్రబృందం చాలా కష్టపడి చేసిన పని ఫలించాలి” అని అన్నారు.
Spam Messages : మీ మెయిల్ ఐడీ స్పామ్ మెసెజెస్‌తో నిండిపోయిందా? శుభవార్త చెప్పిన గూగుల్
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – “భద్రకాళి నా కెరీర్‌లో 25వ సినిమా కావడం నాకు ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ కథలో పొలిటికల్ యాంగిల్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. ఇప్పటివరకు వచ్చిన పొలిటికల్ చిత్రాల కంటే భిన్నంగా, కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. నా మొదటి సినిమాను విడుదల చేసిన రామ్ గారితో మళ్లీ కలసి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది” అని చెప్పారు.
దర్శకుడు అరుణ్ ప్రభు మాట్లాడుతూ – “భద్రకాళి కథలో సమాజం, రాజకీయాలపై ఒక బలమైన మెసేజ్ ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేందుకు మా బృందం ఎంతో శ్రమించింది” అని వివరించారు.
తాజాగా విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, శక్తివంతమైన కథాంశం కారణంగా ‘భద్రకాళి’పై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. సెప్టెంబర్ 5న విడుదలతో ఈ అంచనాలను సినిమా ఏ మేర నెరవేర్చుతుందో చూడాలి.
Vice President: తెలంగాణకు ఉపరాష్ట్రపతి పదవి?!