Chhaava : విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన చావా సినిమా ఇటీవల హిందీలో రిలీజయి భారీ విజయం సాధించింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ లో చావా సినిమా పెద్ద హిట్ అయి 500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది.
చావా సినిమా తెలుగులో గీత ఆర్ట్స్ రిలీజ్ చేస్తుంది. మార్చ్ 7న ఈ సినిమా రిలీజవ్వనుంది. తాజాగా చావా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా చావా ట్రైలర్ చూసేయండి..
గతంలో మొఘల్స్ రాజులు ఇండియాని ఎలా దోచుకున్నారో, ఎంతోమంది హిందువులను మతం మార్చారో అందరికి తెలిసిందే. శివాజీ మరణం తర్వాత ఔరంగజేబు కూడా ఇదే చేయడంతో అతన్ని ఎదురించిన శంభాజీ కథ, శంభాజీని ఎంతలా చిత్రహింసలు పెట్టి చంపారో ఈ చావా సినిమాలో చూపించారు. బాలీవుడ్ లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని అంటున్నారు.
Also Read : Dragon Movie Collections: 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్.. మరో రికార్డ్?